ఈ నవల డిల్లీ నేపథ్యంలో రాయడం జరిగింది. దీనికి ఓ కారణం ఉంది. సుమారు ఏడేళ్ళు హిమాచల్ కుల్లూ మనాలీ వెళ్ళే దారిలో ఉన్న ఏసీసీ సిమెంటు ఫ్యాక్టరీలో మా వారు పని చేశారు. హైదరాబాదుకి రావాలన్నా, లేకపోతే హిమాచల్ వెళ్ళాలన్నా, సుమారు 40 గంటలు ప్రయాణం చేయాల్సిందే. చిన్నపిల్లలతో అన్ని గంటలు ప్రయాణం కొంచెం ఇబ్బందిగానే ఉండేది. అందుకని మేము హైదరాబాదు నుంచి వెళ్ళేప్పుడు డిల్లీలో రైలు దిగాక బస్టాండుకి వెళ్లి, చండీఘడ్ వెళ్ళిపోయి, ఆ రాత్రి అక్కడ ఉండిపోయి, మర్నాడు బస్సెక్కి హిమాచల్ వెళ్ళేవాళ్ళం. ఛండీగడ్ నుంచి కీరత్ పూర్ మీదుగా బస్సు వెళ్తుంది. కీరత్ పూర్ వరకూ అంతా మైదానాలే.
ప్రయాణం బావుంటుంది. కానీ కీరత్ పూర్ దాటామంటే అంతా కొండల మీద ప్రయాణం. కడుపులో తిప్పేస్తుంది. అందుకని కొద్దిగా టిఫిన్ చేసి వాంతులు రాకుండా టాబ్లెట్లు వేసుకుని బయల్దేరేవాళ్ళం. చండీఘడ్ మీదుగా కల్లూ మనాలీకి హర్యానా, పంజాబ్, డిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల బస్సులు వెళ్తాయి. అందుకుని ఏ టైములోనైనా బస్సులు సిద్ధంగా ఉంటాయి. సాయంత్రానికి ఇల్లు చేరుకునే వాళ్ళం. అలాగే హైదరాబాదు వచ్చేప్పుడు కూడా రాత్రి ప్రయాణం మానుకొని డిల్లీలో ఉండిపోయే వాళ్ళం. ఏపీలో కానీ, దక్షిణ్ లో కానీ వెళ్ళేవాళ్ళం. ఓ విధంగా ఈ ప్రయాణాల మూలంగా అప్పుడప్పుడు కంపెనీ పనిమీద డిల్లీ వెళ్లినప్పుడు అక్కడి గెస్ట్ హౌసులో ఉండడం వలన ఈ ప్రాంతం బాగా పరిచయం అవడంతో ఆ నేపథ్యంలో రాయడం జరిగింది.
ఈ నవల డిల్లీ నేపథ్యంలో రాయడం జరిగింది. దీనికి ఓ కారణం ఉంది. సుమారు ఏడేళ్ళు హిమాచల్ కుల్లూ మనాలీ వెళ్ళే దారిలో ఉన్న ఏసీసీ సిమెంటు ఫ్యాక్టరీలో మా వారు పని చేశారు. హైదరాబాదుకి రావాలన్నా, లేకపోతే హిమాచల్ వెళ్ళాలన్నా, సుమారు 40 గంటలు ప్రయాణం చేయాల్సిందే. చిన్నపిల్లలతో అన్ని గంటలు ప్రయాణం కొంచెం ఇబ్బందిగానే ఉండేది. అందుకని మేము హైదరాబాదు నుంచి వెళ్ళేప్పుడు డిల్లీలో రైలు దిగాక బస్టాండుకి వెళ్లి, చండీఘడ్ వెళ్ళిపోయి, ఆ రాత్రి అక్కడ ఉండిపోయి, మర్నాడు బస్సెక్కి హిమాచల్ వెళ్ళేవాళ్ళం. ఛండీగడ్ నుంచి కీరత్ పూర్ మీదుగా బస్సు వెళ్తుంది. కీరత్ పూర్ వరకూ అంతా మైదానాలే. ప్రయాణం బావుంటుంది. కానీ కీరత్ పూర్ దాటామంటే అంతా కొండల మీద ప్రయాణం. కడుపులో తిప్పేస్తుంది. అందుకని కొద్దిగా టిఫిన్ చేసి వాంతులు రాకుండా టాబ్లెట్లు వేసుకుని బయల్దేరేవాళ్ళం. చండీఘడ్ మీదుగా కల్లూ మనాలీకి హర్యానా, పంజాబ్, డిల్లీ, హిమాచల్ ప్రదేశ్ ఈ నాలుగు రాష్ట్రాల బస్సులు వెళ్తాయి. అందుకుని ఏ టైములోనైనా బస్సులు సిద్ధంగా ఉంటాయి. సాయంత్రానికి ఇల్లు చేరుకునే వాళ్ళం. అలాగే హైదరాబాదు వచ్చేప్పుడు కూడా రాత్రి ప్రయాణం మానుకొని డిల్లీలో ఉండిపోయే వాళ్ళం. ఏపీలో కానీ, దక్షిణ్ లో కానీ వెళ్ళేవాళ్ళం. ఓ విధంగా ఈ ప్రయాణాల మూలంగా అప్పుడప్పుడు కంపెనీ పనిమీద డిల్లీ వెళ్లినప్పుడు అక్కడి గెస్ట్ హౌసులో ఉండడం వలన ఈ ప్రాంతం బాగా పరిచయం అవడంతో ఆ నేపథ్యంలో రాయడం జరిగింది.© 2017,www.logili.com All Rights Reserved.