టాక్స్టైట్: భవిష్యత్ నిర్మాణం కోసం
'ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై' ఆకులకు పత్రహరితం ఇవ్వవచ్చు. శ్రమజీవి రక్తాన్ని చెమట చుక్కలుగా నేల మీద రాల్చవచ్చు. భూమి తన చుట్టూ తిరిగిన మేర కాలగమనాన్ని నిర్దేశించవచ్చు. ప్రజలు నిర్మించే చరిత్రను రుతుచక్రం వలె కాకుండా మార్పు చైతన్యంగా పురోగమన మార్గం పట్టించవచ్చు.
| పాణి బృహత్ నవల 'అనేక వైపుల' అన్ని విధాల ఒక అద్భుతమైన ప్రయోగం. ఒక క్లాసికల్ ప్రయత్నం. అనేక వైపుల విప్లవం ప్రసరించే వినూత్నమైన వెలుగు. ఒక ఆలోచన నుంచి, ఒక సంభాషణ నుంచి ఈ తరాన్ని, ఈ కాలాన్ని సృజించడం. అనేక వైపుల నిర్బంధాల మధ్యనే అనేక ఉద్యమ విస్తరణలను ఆవిష్కరించడం. అనేక తలాలను స్పృశిస్తూ, అనేక తంత్రులను మీటే ఒక రాగం. ఒక చర్య.
మానవ సంబంధాలను పరస్పర కలయికల్లో, పలు రకాల పనుల్లో, ఒకరి నుంచొకరికి ప్రవహించే, ప్రసరించే సంభాషణల్లో నిగ్గుదేలే కర్తవ్యోన్ముఖతలో దృఢపడే - కవ్వంతో చిలికిన సారం.
‘అనేకవైపుల’ అనేక అవసరాలు, అనేక ఆలోచనలు, ఏ ఒక్కటి స్వార్థ ప్రయోజనానికి తావివ్వని అనేక ఐక్యతలు - వర్గ పోరాటం కత్తివాదర మీద నికషోపలంగా నిరూపితం కావడం. అన్నిటికీ భూమిక ఉత్పత్తి సంబంధాలు మారి ఉత్పత్తి శక్తుల విజయానికి దారి తీసే అనేకాల ఐక్యతలలో వైరుధ్యాలు పరిష్కరింపబడడం. ఈ నవల మన ముందు ఒక ఉజ్వలమైన, ఉత్తేజకరమైన వాస్తవిక, ఆదర్శ ఆచరణను ఆవిష్కరించింది. ఇది మొదలే రూపొందిన ఆకృతి కాదు. పొరలు పొరలుగా, మనుషుల లోపల నుంచి తొలుచుకుని వచ్చే భావాలు నిరంతరం పరీక్షకు గురవుతూ ఒక గ్లోబల్ సంగ్రామంలో, ఒక విప్లవ కుగ్రామంలో, కారడవిలో మనుషుల మధ్య పరిష్కారాన్ని వెతుక్కునే వైపు పోరాటంగా, అమరత్వంగా, మార్గనిర్దేశకంగా ఎట్లా రూపొందుతాయో చిత్రించింది. మనుషులు కేంద్రంగా సంచరించే, సంచలించే విప్లవం ఎన్ని ప్రేమలతో, ఎన్ని వియోగాలతో, ఎన్ని..................
టాక్స్టైట్: భవిష్యత్ నిర్మాణం కోసం 'ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడై' ఆకులకు పత్రహరితం ఇవ్వవచ్చు. శ్రమజీవి రక్తాన్ని చెమట చుక్కలుగా నేల మీద రాల్చవచ్చు. భూమి తన చుట్టూ తిరిగిన మేర కాలగమనాన్ని నిర్దేశించవచ్చు. ప్రజలు నిర్మించే చరిత్రను రుతుచక్రం వలె కాకుండా మార్పు చైతన్యంగా పురోగమన మార్గం పట్టించవచ్చు. | పాణి బృహత్ నవల 'అనేక వైపుల' అన్ని విధాల ఒక అద్భుతమైన ప్రయోగం. ఒక క్లాసికల్ ప్రయత్నం. అనేక వైపుల విప్లవం ప్రసరించే వినూత్నమైన వెలుగు. ఒక ఆలోచన నుంచి, ఒక సంభాషణ నుంచి ఈ తరాన్ని, ఈ కాలాన్ని సృజించడం. అనేక వైపుల నిర్బంధాల మధ్యనే అనేక ఉద్యమ విస్తరణలను ఆవిష్కరించడం. అనేక తలాలను స్పృశిస్తూ, అనేక తంత్రులను మీటే ఒక రాగం. ఒక చర్య. మానవ సంబంధాలను పరస్పర కలయికల్లో, పలు రకాల పనుల్లో, ఒకరి నుంచొకరికి ప్రవహించే, ప్రసరించే సంభాషణల్లో నిగ్గుదేలే కర్తవ్యోన్ముఖతలో దృఢపడే - కవ్వంతో చిలికిన సారం. ‘అనేకవైపుల’ అనేక అవసరాలు, అనేక ఆలోచనలు, ఏ ఒక్కటి స్వార్థ ప్రయోజనానికి తావివ్వని అనేక ఐక్యతలు - వర్గ పోరాటం కత్తివాదర మీద నికషోపలంగా నిరూపితం కావడం. అన్నిటికీ భూమిక ఉత్పత్తి సంబంధాలు మారి ఉత్పత్తి శక్తుల విజయానికి దారి తీసే అనేకాల ఐక్యతలలో వైరుధ్యాలు పరిష్కరింపబడడం. ఈ నవల మన ముందు ఒక ఉజ్వలమైన, ఉత్తేజకరమైన వాస్తవిక, ఆదర్శ ఆచరణను ఆవిష్కరించింది. ఇది మొదలే రూపొందిన ఆకృతి కాదు. పొరలు పొరలుగా, మనుషుల లోపల నుంచి తొలుచుకుని వచ్చే భావాలు నిరంతరం పరీక్షకు గురవుతూ ఒక గ్లోబల్ సంగ్రామంలో, ఒక విప్లవ కుగ్రామంలో, కారడవిలో మనుషుల మధ్య పరిష్కారాన్ని వెతుక్కునే వైపు పోరాటంగా, అమరత్వంగా, మార్గనిర్దేశకంగా ఎట్లా రూపొందుతాయో చిత్రించింది. మనుషులు కేంద్రంగా సంచరించే, సంచలించే విప్లవం ఎన్ని ప్రేమలతో, ఎన్ని వియోగాలతో, ఎన్ని..................© 2017,www.logili.com All Rights Reserved.