కుదుపు
తీవ్రమైన కుదుపు, పెద్ద ఎత్తున అలజడి, తీరని ఆవేదన.. ఇవేవీ లేనిదే మార్పు సాధ్యం కాదు. ఆ అపార్ట్మెంట్ వాసుల్లో మార్పు కూడా అలాగే మొదలైంది.
తాను వుండే అపార్ట్మెంట్ సెక్రటరీ ఫోన్ చేసి, చెప్పినప్పటి నుంచీ అతను బాధపడుతూనే వున్నాడు.
‘ఆటలు చాలించి కాసేపు చదువుకోమని మందలిస్తే ఇంతపని చేస్తాడా? ఏళ్లకేళ్లు ప్రాణంలో ప్రాణంగా పెంచుకున్న పిల్లలు ఇలా చేస్తే ఎలా?' ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కిపోతోంది .
ఇంతలో భార్య నుంచి ఫోన్.. 'బయల్దేరావా?' అని.
ఆమెను 'కంగారు పడొద్ద'ని చెప్పి, అతను ఇంటికి బయల్దేరాడు. బైక్ నడుపుతుంటే ఇంట్లో నిన్న రాత్రి జరిగిన సంభాషణ గుర్తొచ్చింది.
అతను మెడకీ, చెవికీ మధ్య ఫోన్ పెట్టుకుని మాట్లాడుతూనే ఇంట్లోకి వచ్చాడు.
అతన్ని చూడగానే పిల్లలు మీద పడుతూ, ఎప్పుడు డాడీ మాట్లాడటం అయిపోతుందా, ఫోన్ లాక్కుందామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అతను ఫోన్ మాట్లాడటం పూర్తికాగానే, దాన్ని లాగేసుకుని, హడావిడిగా ఏదో గేమ్ ఓపెన్ చేసి ఆడటం మొదలు పెట్టారు.
అతను లాప్టాప్ బ్యాగ్ పక్కన పెట్టి కిచెన్లోకి వెళ్లాడు. "ఎందుకలా ఫోన్లు ఇచ్చి పిల్లలను చెడగొడతావ్?" టీ ఇస్తూ అందామె.......................
కుదుపుతీవ్రమైన కుదుపు, పెద్ద ఎత్తున అలజడి, తీరని ఆవేదన.. ఇవేవీ లేనిదే మార్పు సాధ్యం కాదు. ఆ అపార్ట్మెంట్ వాసుల్లో మార్పు కూడా అలాగే మొదలైంది. తాను వుండే అపార్ట్మెంట్ సెక్రటరీ ఫోన్ చేసి, చెప్పినప్పటి నుంచీ అతను బాధపడుతూనే వున్నాడు. ‘ఆటలు చాలించి కాసేపు చదువుకోమని మందలిస్తే ఇంతపని చేస్తాడా? ఏళ్లకేళ్లు ప్రాణంలో ప్రాణంగా పెంచుకున్న పిల్లలు ఇలా చేస్తే ఎలా?' ఆలోచనలతో అతని బుర్ర వేడెక్కిపోతోంది . ఇంతలో భార్య నుంచి ఫోన్.. 'బయల్దేరావా?' అని. ఆమెను 'కంగారు పడొద్ద'ని చెప్పి, అతను ఇంటికి బయల్దేరాడు. బైక్ నడుపుతుంటే ఇంట్లో నిన్న రాత్రి జరిగిన సంభాషణ గుర్తొచ్చింది. అతను మెడకీ, చెవికీ మధ్య ఫోన్ పెట్టుకుని మాట్లాడుతూనే ఇంట్లోకి వచ్చాడు. అతన్ని చూడగానే పిల్లలు మీద పడుతూ, ఎప్పుడు డాడీ మాట్లాడటం అయిపోతుందా, ఫోన్ లాక్కుందామా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అతను ఫోన్ మాట్లాడటం పూర్తికాగానే, దాన్ని లాగేసుకుని, హడావిడిగా ఏదో గేమ్ ఓపెన్ చేసి ఆడటం మొదలు పెట్టారు. అతను లాప్టాప్ బ్యాగ్ పక్కన పెట్టి కిచెన్లోకి వెళ్లాడు. "ఎందుకలా ఫోన్లు ఇచ్చి పిల్లలను చెడగొడతావ్?" టీ ఇస్తూ అందామె.......................© 2017,www.logili.com All Rights Reserved.