మా పూర్వికులు, మా గ్రామస్తులు, మా పరిసర గ్రామస్తులు అలాగలాగ మా ఉరి నుండి ఉత్తరాంధ్ర దాకా తారస పడిన అనేకానేకులు చాన్నాళ్లుగా నా లోలోపల గూడు కట్టుకొని మా గురిండి రాయవేట్రా అని గుణిసేవారు.
ఈలోగా నా జీవితకాలంలో సగానికంటే యెక్కువ కాలం సన్నవరించిన, నాతో సహచరించిన నా అరుణ... కేన్సర్ మహమ్మారితో పోరాడుతోంది.
ఆమెను చూస్తున్నపుడల్లా ... ఆమె పూర్వికులు, ఆమె గ్రామస్తులు, ఆమెతోపాటు నాకు తారసపడిన అనేకానేకులు .. మా గురించి రాయవేమోయ్ అనడిగివోరు!
నవల అప్పుడారంభించెను... రెండోపార్ట్ ఆరంభించి అరుణా దగ్గర చదివేను. ఆమె కళ్ళల్లో తడి, యేదో మేరువు కనబడింది. తర్వాత్తర్వాత ఆమె అనారోగ్య యిబ్బందులవల్ల నవల రాత కొనసాగించలేక పోయాను . ఆమె నన్ను విడిచి వెళిపోయిన రెండున్నరేళ్ల దాకా నవలను ముట్టుకోలేదు.