ఎందుకు రాసేనంటే...
'మాంచాలను తలుస్తారు - మల్లమ్మను కొలుస్తారు.
ఝాన్సీలక్ష్మీబాయికి పటంగట్టి పూజిస్తారు -
పంచాది నిర్మలంటే భయం పుట్టి వణుకుతారు'
శ్రీశ్రీ కవితాపాదాలు అందరిలాగే నన్నెంతగానో ఉత్తేజితుణ్ని చేసాయి. చేస్తున్నాయి. పంచాది నిర్మల గారి గురించి తలవగానే ఆమె చేసిన త్యాగం, చూపిన ధీరోధాత్తత వినీ, చదివి ఆశ్చర్య పోయేవాడిని. నేను జీవించిన కాలంలో... మాంచాల, మల్లమ్మ, ఝాన్సీలక్ష్మీబాయిలను మించిన నిర్మల వుందంటే ఉత్తేజం కలిగేది. నేను జీవించిన కాలమే కాక, నేను జీవించిన ప్రాంతానికి సమీపంలోనే పోరాటం సాగటం, వీరుల కదలికలు, వీరులపై దాడికి తిరిగే పోలీసులు కవాతులూ... చూస్తుండిన వాడిని.
తర్వాత్తర్వాత శ్రీకాకుళ విప్లవోద్యమాన్ని తెలుసుకోవడం, తెలిసిన వాటిలో కొన్నిటిని కథనం చేయదలచటం... అలా సాహిత్యరంగంలోకి వచ్చేను. పంచాది నిర్మల గారితో పాటూ అమరులు అంకమ్మ, సరస్వతీ... నాలుగైదేళ్ల కిందట మరణించిన చంద్రమ్మ, జయమ్మలూ ఇంకెందరో మహిళలు, పురుషులతో పాటు శ్రీకాకుళోద్యమానికి తమ జీవితాలను అర్పించేరు. కొందరు అమరులైనారు, కొందరు జీవించివున్నారు.
దాదాపుగా నలభయ్యేళ్ల నా సాహిత్యప్రయాణంలో విప్లవోద్యమాన్నీ, విస్తృత కళింగాంధ్రా సామాజిక ప్రయాణాన్నీ నా శక్తిమేరకు సాహిత్యీకరించేను, గానీ ..................
ఎందుకు రాసేనంటే... 'మాంచాలను తలుస్తారు - మల్లమ్మను కొలుస్తారు. ఝాన్సీలక్ష్మీబాయికి పటంగట్టి పూజిస్తారు - పంచాది నిర్మలంటే భయం పుట్టి వణుకుతారు' శ్రీశ్రీ కవితాపాదాలు అందరిలాగే నన్నెంతగానో ఉత్తేజితుణ్ని చేసాయి. చేస్తున్నాయి. పంచాది నిర్మల గారి గురించి తలవగానే ఆమె చేసిన త్యాగం, చూపిన ధీరోధాత్తత వినీ, చదివి ఆశ్చర్య పోయేవాడిని. నేను జీవించిన కాలంలో... మాంచాల, మల్లమ్మ, ఝాన్సీలక్ష్మీబాయిలను మించిన నిర్మల వుందంటే ఉత్తేజం కలిగేది. నేను జీవించిన కాలమే కాక, నేను జీవించిన ప్రాంతానికి సమీపంలోనే పోరాటం సాగటం, వీరుల కదలికలు, వీరులపై దాడికి తిరిగే పోలీసులు కవాతులూ... చూస్తుండిన వాడిని. తర్వాత్తర్వాత శ్రీకాకుళ విప్లవోద్యమాన్ని తెలుసుకోవడం, తెలిసిన వాటిలో కొన్నిటిని కథనం చేయదలచటం... అలా సాహిత్యరంగంలోకి వచ్చేను. పంచాది నిర్మల గారితో పాటూ అమరులు అంకమ్మ, సరస్వతీ... నాలుగైదేళ్ల కిందట మరణించిన చంద్రమ్మ, జయమ్మలూ ఇంకెందరో మహిళలు, పురుషులతో పాటు శ్రీకాకుళోద్యమానికి తమ జీవితాలను అర్పించేరు. కొందరు అమరులైనారు, కొందరు జీవించివున్నారు. దాదాపుగా నలభయ్యేళ్ల నా సాహిత్యప్రయాణంలో విప్లవోద్యమాన్నీ, విస్తృత కళింగాంధ్రా సామాజిక ప్రయాణాన్నీ నా శక్తిమేరకు సాహిత్యీకరించేను, గానీ ..................© 2017,www.logili.com All Rights Reserved.