గురజాడ వెంకట అప్పారావు
21.09.1862-30.11.1915
విశాఖపట్నం సమీపంలోని యలమంచిలి దగ్గరలోని ఎన్. రాయవరం గ్రామంలో జన్మించారు. కన్యాశుల్కం వీరు రాసిన ప్రసిద్ధ నాటకం, కొండుభట్టీయం, సౌదామిని, తదితర రచనలు, దేశభక్తి, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ తదితర ప్రసిద్ధి చెందిన గేయాలు రాశారు. కథ, కవిత, నాటకం రచనలతో ఆధునికజాడ వేసినవాడు.
-----గురజాడ వెంకట అప్పారావు
దేవుళ్ళారా మీ పేరేమిటి?
దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్ళారా! మీ పేరేమిటి?
పురాణములు గురించి మేము శంకలు వేస్తే, మా గురువు గారు "వెధవ చదువు! మీ మతులు పోతున్నాయి. మీరు వొట్టి బౌద్ధులు" అనేవారు.
"బౌద్ధులు యెషువంటి వారు శాస్తుల్లు గారూ?” అని రామ్మూర్తి అడిగాడు. రామ్మూర్తి శతపెంకె. “రేపు ఆదివారం నాడు పువ్వుల తోటలో ఉపన్యాసం యిస్తాను, అంతా రండి" అని శాస్త్రులు గారు శలవిచ్చారు.
ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలప్పుడు. పువ్వుల తోటలో ఒక పరుపు మావిడి చెట్టుకింద యిసకలో మేమంతా పాతికమంది కూచున్నాం. మధ్య గావంచా పరచుకుని, మాకు అభిముఖంగా శాస్తులు గారు కూచున్నారు. నేను బల్ల చెక్క తెచ్చి వెయ్యబోతే, "వొద్దురా, మీరంతా కింద కూచుంటే, నేను బల్లమీద కూచుంటా!" అన్నారు. రెండు కొబ్బరి కాయల నీళ్ళు తాగి తాంబూలము వేస్తూ, శాస్త్రులు గారు బౌద్ధమతం విషయమై ఉపన్యాసం ఉపక్రమించారు. పది......................
గురజాడ వెంకట అప్పారావు 21.09.1862-30.11.1915 విశాఖపట్నం సమీపంలోని యలమంచిలి దగ్గరలోని ఎన్. రాయవరం గ్రామంలో జన్మించారు. కన్యాశుల్కం వీరు రాసిన ప్రసిద్ధ నాటకం, కొండుభట్టీయం, సౌదామిని, తదితర రచనలు, దేశభక్తి, పుత్తడిబొమ్మ పూర్ణమ్మ తదితర ప్రసిద్ధి చెందిన గేయాలు రాశారు. కథ, కవిత, నాటకం రచనలతో ఆధునికజాడ వేసినవాడు. -----గురజాడ వెంకట అప్పారావు దేవుళ్ళారా మీ పేరేమిటి? దేవుడు చేసిన మనుషుల్లారా! మనుషులు చేసిన దేవుళ్ళారా! మీ పేరేమిటి? పురాణములు గురించి మేము శంకలు వేస్తే, మా గురువు గారు "వెధవ చదువు! మీ మతులు పోతున్నాయి. మీరు వొట్టి బౌద్ధులు" అనేవారు. "బౌద్ధులు యెషువంటి వారు శాస్తుల్లు గారూ?” అని రామ్మూర్తి అడిగాడు. రామ్మూర్తి శతపెంకె. “రేపు ఆదివారం నాడు పువ్వుల తోటలో ఉపన్యాసం యిస్తాను, అంతా రండి" అని శాస్త్రులు గారు శలవిచ్చారు. ఆదివారం మధ్యాహ్నం నాలుగు గంటలప్పుడు. పువ్వుల తోటలో ఒక పరుపు మావిడి చెట్టుకింద యిసకలో మేమంతా పాతికమంది కూచున్నాం. మధ్య గావంచా పరచుకుని, మాకు అభిముఖంగా శాస్తులు గారు కూచున్నారు. నేను బల్ల చెక్క తెచ్చి వెయ్యబోతే, "వొద్దురా, మీరంతా కింద కూచుంటే, నేను బల్లమీద కూచుంటా!" అన్నారు. రెండు కొబ్బరి కాయల నీళ్ళు తాగి తాంబూలము వేస్తూ, శాస్త్రులు గారు బౌద్ధమతం విషయమై ఉపన్యాసం ఉపక్రమించారు. పది......................© 2017,www.logili.com All Rights Reserved.