ఆళ్వారులు వైష్ణవులుగా మారిన వైనం
“రాజ భవనం ఇప్పుడు కళకళలాడిపోతున్నది". అన్నారు నారాయణ
"ఆ! అవును...! ఆయన మాటలతో ఏకీభవించిన శంకర నంబూద్రి" అయినా ఓ సందేహం....!
చేతులు వెనక్కికట్టుకుని అటు ఇటు పచార్లు చేస్తున్న నారాయణ నంబూద్రి ఆగి ఆయనను చూశాడు.
“చేరవంశంలోని రాజులందరూ శైవులుగానే వున్నారు. ఈయన మాత్రం ఎందుకు వైష్ణవులుగా మారతారు..?” అని అడిగాడు శంకర నంబూద్రి.
“నువ్వు దేన్ని అయినా ఎక్కువగా వింటావో ఎందులో ఎక్కువగా లీనం అయిపోతావో దాన్ని గురించే ఆలోచిస్తావు. అందులోనే విలీనం అవుతావు... ప్రేమించినవాడు జాతిని గురించి ఆలోచించడు.. దైవభక్తి కలవాడు మత బేధాలను పరిగణించడు... వంజి నగరంలో కొంత కాలంగా వైష్ణవులే తిరుగుతూ కనపడుతున్నారు... వారందరిని మహారాజు పిల్చి కూర్చోపెట్టుకుని ఎందుకు వాదనలు చేస్తున్నారన్నదీ నాకంతుపట్ట లేదు అప్పుడు... పైగా ఆశ్చర్యమనిపించింది... వారి సెంథమిళ్ (ప్రాచీన తమిళం) మీద రాజుగారు ఆకర్షితులైయారని నేను గమనించాను... కేరళ దేశంలో లేని తమిళంలో లేని కొన్ని పదాలు అందమైన భావనలు వారి సెంథమిళంలో వున్నాయి... రాజుగారు వైష్ణం వైపు ఆకర్షితులవడానికి కారణం అని నాకనిపించింది”. అని వివరించారు నారాయణ నంబూద్రి శంకర నంబూద్రికి..............................
ఆళ్వారులు వైష్ణవులుగా మారిన వైనం “రాజ భవనం ఇప్పుడు కళకళలాడిపోతున్నది". అన్నారు నారాయణ "ఆ! అవును...! ఆయన మాటలతో ఏకీభవించిన శంకర నంబూద్రి" అయినా ఓ సందేహం....! చేతులు వెనక్కికట్టుకుని అటు ఇటు పచార్లు చేస్తున్న నారాయణ నంబూద్రి ఆగి ఆయనను చూశాడు. “చేరవంశంలోని రాజులందరూ శైవులుగానే వున్నారు. ఈయన మాత్రం ఎందుకు వైష్ణవులుగా మారతారు..?” అని అడిగాడు శంకర నంబూద్రి. “నువ్వు దేన్ని అయినా ఎక్కువగా వింటావో ఎందులో ఎక్కువగా లీనం అయిపోతావో దాన్ని గురించే ఆలోచిస్తావు. అందులోనే విలీనం అవుతావు... ప్రేమించినవాడు జాతిని గురించి ఆలోచించడు.. దైవభక్తి కలవాడు మత బేధాలను పరిగణించడు... వంజి నగరంలో కొంత కాలంగా వైష్ణవులే తిరుగుతూ కనపడుతున్నారు... వారందరిని మహారాజు పిల్చి కూర్చోపెట్టుకుని ఎందుకు వాదనలు చేస్తున్నారన్నదీ నాకంతుపట్ట లేదు అప్పుడు... పైగా ఆశ్చర్యమనిపించింది... వారి సెంథమిళ్ (ప్రాచీన తమిళం) మీద రాజుగారు ఆకర్షితులైయారని నేను గమనించాను... కేరళ దేశంలో లేని తమిళంలో లేని కొన్ని పదాలు అందమైన భావనలు వారి సెంథమిళంలో వున్నాయి... రాజుగారు వైష్ణం వైపు ఆకర్షితులవడానికి కారణం అని నాకనిపించింది”. అని వివరించారు నారాయణ నంబూద్రి శంకర నంబూద్రికి..............................© 2017,www.logili.com All Rights Reserved.