తమ పదహారేళ్ళ వయస్సులోనే మొదటి కథను ప్రచురించిన ఎం.వి. వెంకట్రామన్ (1920 -)తమిళ సాహిత్యంలో మేటి రచయిత. తేనీ, పాలం లాంటి తన సాహిత్య పత్రికల ద్వారా ఎందరో యువ రచయితలను పైకి తెచ్చిన వెంకట్రామన్ గారు రచించిన కాదుకళ్; ఈ నవల 1992వ సంవత్సరం సాహిత్య అకాడమీ బహుమతి నందుకున్నది.
ప్రకృతిలో ఇహపరమైనవాటినన్నిటినీ తనలో ఇముడ్చుకునే మాతృత్వానికీ, లౌకికమూ, లైంగికపరమూ అయిన పురుషత్వానికీ మధ్య కలిగే బాధాకరమైన సంఘర్షణలకు నడుమ ఆధ్యాత్మిక ప్రస్థానం గావిస్తాడు కథానాయకుడు మాలి. ఈ ఘర్షణలూ, అంతరంగిక విషయాలనూ వారి 'చెవులు' విన్నట్టుగా ప్రతీకాత్మకంగా చిత్రించారు రచయిత.
ఈ నవలను తెలుగులోకి అందించినవారు డా. మానికొండ విజయలక్ష్మి గారు. వీరు కవితలు, వ్యాసాలూ వ్రాయడమే కాక తమిళం, హిందీ, తెలుగు బాషల్లోకి అనువాదాలు కూడా చేసియున్నారు.
తమ పదహారేళ్ళ వయస్సులోనే మొదటి కథను ప్రచురించిన ఎం.వి. వెంకట్రామన్ (1920 -)తమిళ సాహిత్యంలో మేటి రచయిత. తేనీ, పాలం లాంటి తన సాహిత్య పత్రికల ద్వారా ఎందరో యువ రచయితలను పైకి తెచ్చిన వెంకట్రామన్ గారు రచించిన కాదుకళ్; ఈ నవల 1992వ సంవత్సరం సాహిత్య అకాడమీ బహుమతి నందుకున్నది. ప్రకృతిలో ఇహపరమైనవాటినన్నిటినీ తనలో ఇముడ్చుకునే మాతృత్వానికీ, లౌకికమూ, లైంగికపరమూ అయిన పురుషత్వానికీ మధ్య కలిగే బాధాకరమైన సంఘర్షణలకు నడుమ ఆధ్యాత్మిక ప్రస్థానం గావిస్తాడు కథానాయకుడు మాలి. ఈ ఘర్షణలూ, అంతరంగిక విషయాలనూ వారి 'చెవులు' విన్నట్టుగా ప్రతీకాత్మకంగా చిత్రించారు రచయిత. ఈ నవలను తెలుగులోకి అందించినవారు డా. మానికొండ విజయలక్ష్మి గారు. వీరు కవితలు, వ్యాసాలూ వ్రాయడమే కాక తమిళం, హిందీ, తెలుగు బాషల్లోకి అనువాదాలు కూడా చేసియున్నారు.© 2017,www.logili.com All Rights Reserved.