కౌంట్ డౌన్
బాత్రూం నుండి బయటికి వచ్చింది రీతిగౌళ!
అప్పుడే స్నానం ముగించటంతో... పచ్చని దేహం మీద నీటి బిందువులు... బంగారం మీద పేర్చిన ముత్యాల్లా మెరుస్తున్నాయి.
గుండెలమీద నుండి పిరుదుల వరకూ ఆమె వంటిని హత్తుకున్న టర్కిష్ టవల్తో డ్రసింగ్ టేబుల్ ముందుకు వచ్చి ఎదురుగుండా వున్న నిలువుటద్దంలోకి చూసుకుందామె! ఈరోజుతో తనకు యిరవై నాలుగు వసంతాలు నిండుతున్నాయి. అయినా తన శరీరం యింకా యిరవై ఏళ్ళదే అన్నంత నాజూకుగా, సుకుమారంగా వుంది. తల వెంట్రుకల నుండి పాదాల వరకూ శరీరంలో యవ్వనం మదించిన మత్తేభంలా విహరిస్తోంది.
ఆమె తదేకంగా అద్దంలో అర నిమిషం తన రూపాన్ని చూసుకుని మురిపెంగా నవ్వుకుంది.
అలా చూస్తుంటే తనమీద తనకే మోహం కలిగేటట్లున్న తన అందాన్ని చూసి మగపిల్లలు పిచ్చోళ్ళు అవుతున్నారంటే అవరు మరీ! కాలేజీ నుండి యూనివర్శిటీకి మారిన తరువాత తన ఆరాధకులు సంఖ్య మరింతగా పెరిగిపోయింది. చూపులతో, జాలిగొలిపే మాటలతో కేవలం తన స్నేహం కోసం అర్రులు చాస్తూ... ఎందరో... ఎంతోమంది అబ్బాయిలు అందమైన గులాబీ చుట్టూ చలించే తుమ్మెదల్లా తన చుట్టూ తిరగటం ఆమెకి కాస్త గర్వంగానే అనిపించింది.
టర్కిష్ టవల్ తీసి స్టాండ్మీద వేసి సిద్ధంగా వుంచుకున్న దుస్తులు ధరించింది. నుదుటి మీద సన్నగా తిలకం దిద్దుకుంటుండగా డోర్మీద చప్పుడు వినబడిందామెకి. "అమ్మాయిగారూ...!" ఆ వెంటనే వినబడింది ఆయా విమలమ్మ కంఠం “అయిపోయింది... వస్తున్నా...!" చివరిసారిగా ముంగురులు సవరించుకుంటూ
జవాబు చెప్పింది రీతి..............
కౌంట్ డౌన్బాత్రూం నుండి బయటికి వచ్చింది రీతిగౌళ! అప్పుడే స్నానం ముగించటంతో... పచ్చని దేహం మీద నీటి బిందువులు... బంగారం మీద పేర్చిన ముత్యాల్లా మెరుస్తున్నాయి. గుండెలమీద నుండి పిరుదుల వరకూ ఆమె వంటిని హత్తుకున్న టర్కిష్ టవల్తో డ్రసింగ్ టేబుల్ ముందుకు వచ్చి ఎదురుగుండా వున్న నిలువుటద్దంలోకి చూసుకుందామె! ఈరోజుతో తనకు యిరవై నాలుగు వసంతాలు నిండుతున్నాయి. అయినా తన శరీరం యింకా యిరవై ఏళ్ళదే అన్నంత నాజూకుగా, సుకుమారంగా వుంది. తల వెంట్రుకల నుండి పాదాల వరకూ శరీరంలో యవ్వనం మదించిన మత్తేభంలా విహరిస్తోంది. ఆమె తదేకంగా అద్దంలో అర నిమిషం తన రూపాన్ని చూసుకుని మురిపెంగా నవ్వుకుంది. అలా చూస్తుంటే తనమీద తనకే మోహం కలిగేటట్లున్న తన అందాన్ని చూసి మగపిల్లలు పిచ్చోళ్ళు అవుతున్నారంటే అవరు మరీ! కాలేజీ నుండి యూనివర్శిటీకి మారిన తరువాత తన ఆరాధకులు సంఖ్య మరింతగా పెరిగిపోయింది. చూపులతో, జాలిగొలిపే మాటలతో కేవలం తన స్నేహం కోసం అర్రులు చాస్తూ... ఎందరో... ఎంతోమంది అబ్బాయిలు అందమైన గులాబీ చుట్టూ చలించే తుమ్మెదల్లా తన చుట్టూ తిరగటం ఆమెకి కాస్త గర్వంగానే అనిపించింది. టర్కిష్ టవల్ తీసి స్టాండ్మీద వేసి సిద్ధంగా వుంచుకున్న దుస్తులు ధరించింది. నుదుటి మీద సన్నగా తిలకం దిద్దుకుంటుండగా డోర్మీద చప్పుడు వినబడిందామెకి. "అమ్మాయిగారూ...!" ఆ వెంటనే వినబడింది ఆయా విమలమ్మ కంఠం “అయిపోయింది... వస్తున్నా...!" చివరిసారిగా ముంగురులు సవరించుకుంటూ జవాబు చెప్పింది రీతి..............© 2017,www.logili.com All Rights Reserved.