"మిస్టర్ యోగీ...!
నిశ్శబ్ద సమరం
మీతో పని పడింది. వివరాలు మీరు ఇక్కడకు రాగానే తెలియజేయ బడతాయి. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్లో మావాళ్ళు నిన్ను కలుసుకుంటారు. వాళ్ళని గుర్తుపట్టడం ఎలా అన్నది నీకు తెలుసు. నీ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు నీకు ఈ మెసేజ్ అందజేసిన వారిద్వారా చేయబడతాయ్!
సెంటర్!"
యోగి చేతిలోని పేపర్సీమీద నుంచి దృష్టి ఎదురుగా కారిడార్లో నిలబడివున్న రూమ్ సర్వీసింగ్ బోయ్ మీదకు తిరిగింది.
యోగి ఎడంచేతి గ్లోవ్స్ బయటకు కనిపించకుండా దాగివున్న స్నబ్నోస్ ఏక్షణంలోనయినా నిప్పులు గక్కడానికి సిద్ధంగా వుంది.
యోగి ఎవర్నీ నమ్మడు. నిద్రలోనూ, మామూలు సమయాల్లోనూ కూడా అతను పూర్తి ఎలర్ గా వుంటాడు. అతను నమ్మేది మనుషులని కాదు, ఆయుధాలనే! 'తనకీ ప్రపంచంలో నమ్మకమైన మిత్రులు ఆయుధాలే' అంటాడతను.
ఎవరో తలుపు తట్టగానే అనాలోచితంగా తలుపుతీసి వారి చేతిలోని తుపాకీ గుళ్ళకు ఆహుతి అయిపోవడానికి అతడు సిద్ధంగా లేడు. ఎలాంటి సందర్భంలోనయినా తగు జాగ్రత్తలు తీసుకునే ముందుకు అడుగువేస్తాడు...............
"మిస్టర్ యోగీ...! నిశ్శబ్ద సమరం మీతో పని పడింది. వివరాలు మీరు ఇక్కడకు రాగానే తెలియజేయ బడతాయి. ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్లో మావాళ్ళు నిన్ను కలుసుకుంటారు. వాళ్ళని గుర్తుపట్టడం ఎలా అన్నది నీకు తెలుసు. నీ ప్రయాణానికి కావలసిన ఏర్పాట్లు నీకు ఈ మెసేజ్ అందజేసిన వారిద్వారా చేయబడతాయ్! సెంటర్!" యోగి చేతిలోని పేపర్సీమీద నుంచి దృష్టి ఎదురుగా కారిడార్లో నిలబడివున్న రూమ్ సర్వీసింగ్ బోయ్ మీదకు తిరిగింది. యోగి ఎడంచేతి గ్లోవ్స్ బయటకు కనిపించకుండా దాగివున్న స్నబ్నోస్ ఏక్షణంలోనయినా నిప్పులు గక్కడానికి సిద్ధంగా వుంది. యోగి ఎవర్నీ నమ్మడు. నిద్రలోనూ, మామూలు సమయాల్లోనూ కూడా అతను పూర్తి ఎలర్ గా వుంటాడు. అతను నమ్మేది మనుషులని కాదు, ఆయుధాలనే! 'తనకీ ప్రపంచంలో నమ్మకమైన మిత్రులు ఆయుధాలే' అంటాడతను. ఎవరో తలుపు తట్టగానే అనాలోచితంగా తలుపుతీసి వారి చేతిలోని తుపాకీ గుళ్ళకు ఆహుతి అయిపోవడానికి అతడు సిద్ధంగా లేడు. ఎలాంటి సందర్భంలోనయినా తగు జాగ్రత్తలు తీసుకునే ముందుకు అడుగువేస్తాడు...............© 2017,www.logili.com All Rights Reserved.