ఒరియా జ్ఞానపీఠ పురస్కార గ్రహీత గోపీనాథ్ మహంతి (20.04.1914 - 20.08.1991) : అమృతర సంతాన, మాటిర మటాళ, నవలలు వీరికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారాన్ని తెచ్చి పెట్టాయి. ఒడియా సాహిత్యంలో ప్రథమ జ్ఞానపీఠ పురస్కారం (1973) వీరిని వరించింది. ఆదివాసీల, వివక్షకు గురి అవుతున్న జాతుల జీవితాలను నేపథ్యంగా స్వీకరించి ఒడియా సాహిత్యంలో అనేక రచనలు చేశారు. వాస్తవికత పునాదుల పై అద్భుత కథా శిల్పాలను సృష్టించిన గద్య మహాకావ్య స్రష్ట గోపీనాథ్ మహంతి. -
ఈ నవలను తెలుగులోకి అనువదించిన డా|| తుర్లపాటి రాజేశ్వరి 2002లో ఎంపిక చేసిన ఇరవై ఒడియా కవితల తెలుగు అనువాదం 'అమృత' ఒడిశా సాహిత్య అకాడెమీ ద్వారా తెలుగువారికి అందించారు. పద్మశ్రీ ప్రతిభారాయ్ ఒడియా కథల తెలుగు అనువాదం 'ఉల్లంఘన' కేంద్ర సాహిత్య అకాడెమీ ప్రచురణ. తెలుగు, ఒరియా బాషలచరిత్ర, సాహిత్య, సాంస్కృతిక సంబంధాలపై పలు పరిశోధనాత్మక -వ్యాసాలు తెలుగుదనం, వ్యాసవారధి, వ్యాస నీరాజనం మూడు సంపుటాలలో - వెలువరించి సాహితీవారధిగా కృషి చేస్తున్న రచయిత్రి. పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం హైద్రాబాద్ నుండి ఉత్తమ గ్రంథ పురస్కారం, ఉత్తమ రచయిత్రి పురస్కారం పొందిన రచయిత్రి, కవయిత్రి.
© 2017,www.logili.com All Rights Reserved.