"వెనుక దగా, ముందు దగా, కుడియెడమల దగాదగా" కుట్రలూ, కుహకాలూ, మోసాలూ, ద్వేషాలూ, నిచ్చెనలుగా వేసుకుని మేడిపండు నిగానిగాలతో, జీవితంలో పెద్ద మనుషులనిపించుకోవడం, ధ్యేయం కొందరికి. ఆ మార్గంలో, వారికి బంధుత్వాలు, అనుబంధాలు కళకు రక్తసంబంధీకులు కూడా కంటకాలుగా తోస్తారు. స్వార్థాన్ని వస్త్రాలుగా ధరించి జీవితాన్ని రంగుల మాయం చేసుకున్నామని భ్రమిస్తారు. కానీ, వారినీ, వారి రాక్షసత్వాన్నీ, స్వార్ధపిశాచాలనూ ఎదుర్కొనే శక్తులుగా యువతరంలో కొందరైనా ఎదిరించి నిలబడతారు.
ఈ అక్షరసత్యాలలోంచి, గోముఖ వ్యాఘ్రాల్ని బయటపెట్టి, ప్రభుత్వంలో పలుకుబడి పేరున జరిగే మోసాలు, ప్రజాహిత సంస్థల పేరుతొ స్త్రీ పవిత్ర శీలాన్నీ విక్రయించే కుటాల రంగులు. పల్లెలపాలిత కుచ్చితపు నడతతో చీడపురుగులుగా అవతరించిన ప్రబద్ధుల బండారాలు. కొల్లగొట్టి బయటపెట్టి, అటువంటి వాళ్ళు ఏ గడ్డితినడానికైనా వెరవరని నిరూపించి, నిరవధికంగా పోరాడిన ఆదర్శ పోలీసు ఉద్యోగికి అగ్నిపరీక్ష. అతనికి సహకరించిన యువతుల అనుదిన సహాయ దీక్ష, ఈ నవల మీకందిస్తుంది. రచయిత్రి కలం మిమ్మల్ని వెంబడిస్తుంది.
"వెనుక దగా, ముందు దగా, కుడియెడమల దగాదగా" కుట్రలూ, కుహకాలూ, మోసాలూ, ద్వేషాలూ, నిచ్చెనలుగా వేసుకుని మేడిపండు నిగానిగాలతో, జీవితంలో పెద్ద మనుషులనిపించుకోవడం, ధ్యేయం కొందరికి. ఆ మార్గంలో, వారికి బంధుత్వాలు, అనుబంధాలు కళకు రక్తసంబంధీకులు కూడా కంటకాలుగా తోస్తారు. స్వార్థాన్ని వస్త్రాలుగా ధరించి జీవితాన్ని రంగుల మాయం చేసుకున్నామని భ్రమిస్తారు. కానీ, వారినీ, వారి రాక్షసత్వాన్నీ, స్వార్ధపిశాచాలనూ ఎదుర్కొనే శక్తులుగా యువతరంలో కొందరైనా ఎదిరించి నిలబడతారు. ఈ అక్షరసత్యాలలోంచి, గోముఖ వ్యాఘ్రాల్ని బయటపెట్టి, ప్రభుత్వంలో పలుకుబడి పేరున జరిగే మోసాలు, ప్రజాహిత సంస్థల పేరుతొ స్త్రీ పవిత్ర శీలాన్నీ విక్రయించే కుటాల రంగులు. పల్లెలపాలిత కుచ్చితపు నడతతో చీడపురుగులుగా అవతరించిన ప్రబద్ధుల బండారాలు. కొల్లగొట్టి బయటపెట్టి, అటువంటి వాళ్ళు ఏ గడ్డితినడానికైనా వెరవరని నిరూపించి, నిరవధికంగా పోరాడిన ఆదర్శ పోలీసు ఉద్యోగికి అగ్నిపరీక్ష. అతనికి సహకరించిన యువతుల అనుదిన సహాయ దీక్ష, ఈ నవల మీకందిస్తుంది. రచయిత్రి కలం మిమ్మల్ని వెంబడిస్తుంది.© 2017,www.logili.com All Rights Reserved.