చందు రచనల్లో జీవితరంగ సాన్నిహిత్యం ఉంటుంది. అది అతని అనుభవ ప్రపంచానికీ లోకానుశీలతకు గుర్తు. తీవ్రమైన భావుకత్వం ఉంటుంది. అది కవిత్వ హృదయానికుండే సాంద్రమైన అనుభూతికి సంకేతం. ప్రగాఢమైన సాహిత్య పరిచయం చందూ రచనల్లో కనిపిస్తుంది. సామాజిక శాస్త్రాలతో బాటు విజ్ఞాన శాస్త్రాల మేలనం ఉంటుంది. ఉదార వామపక్షానుకూల ప్రాపంచిక దృక్పథం ఉంటుంది. చాలామంది తెలుగు నవలాకారులకు, రచయితలకు, పండితులకు లేని శక్తివంతమైన శైలి చందూ నవలల్లో కనిపిస్తుంది. సూటిదనం, స్పష్టతా, గాంభీర్యం, హాస్యం, కొంటెతనం, వ్యంగ్యం చందూ కంఠస్వరంలో చూడవచ్చు. కథనంలో ప్రసన్నత ఉంటుంది. వేగం ఉంటుంది. ఈ రెండింటి వెనుక పాఠకుణ్ణి ఆలోచనాత్మకమైన జీవనాంశాలవైపు సామాజిక పరివర్తన వైపు సామూహిక సద్వర్తన వైపు మానవుడు సాధించగలిగే శాస్త్ర విజ్ఞానాంశాలపై మళ్ళించే లక్షణం ఉంటుంది.
- కేతు విశ్వనాథరెడ్డి
చందు రచనల్లో జీవితరంగ సాన్నిహిత్యం ఉంటుంది. అది అతని అనుభవ ప్రపంచానికీ లోకానుశీలతకు గుర్తు. తీవ్రమైన భావుకత్వం ఉంటుంది. అది కవిత్వ హృదయానికుండే సాంద్రమైన అనుభూతికి సంకేతం. ప్రగాఢమైన సాహిత్య పరిచయం చందూ రచనల్లో కనిపిస్తుంది. సామాజిక శాస్త్రాలతో బాటు విజ్ఞాన శాస్త్రాల మేలనం ఉంటుంది. ఉదార వామపక్షానుకూల ప్రాపంచిక దృక్పథం ఉంటుంది. చాలామంది తెలుగు నవలాకారులకు, రచయితలకు, పండితులకు లేని శక్తివంతమైన శైలి చందూ నవలల్లో కనిపిస్తుంది. సూటిదనం, స్పష్టతా, గాంభీర్యం, హాస్యం, కొంటెతనం, వ్యంగ్యం చందూ కంఠస్వరంలో చూడవచ్చు. కథనంలో ప్రసన్నత ఉంటుంది. వేగం ఉంటుంది. ఈ రెండింటి వెనుక పాఠకుణ్ణి ఆలోచనాత్మకమైన జీవనాంశాలవైపు సామాజిక పరివర్తన వైపు సామూహిక సద్వర్తన వైపు మానవుడు సాధించగలిగే శాస్త్ర విజ్ఞానాంశాలపై మళ్ళించే లక్షణం ఉంటుంది. - కేతు విశ్వనాథరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.