దాన ధర్మాలు మన జీవన స్రవంతిలో ఒక భాగం. ఆటవిక దశను మినహాయిస్తే, బానిస సమాజం నుండి ఇప్పటిదాకా దాన ధర్మాలు మానవ సమాజంతోబాటు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ దానధర్మాలు అంటే ప్రజాహితం కోసం వితరణ అని అర్థం. అంటే కొంత ఆస్తిని, ఒక ప్రజాహిత కార్యంకోసం వినియోగించటం. ఆ బాధ్యతను, సదరు ఆస్తి సంరక్షణను ఒక వ్యక్తి, లేక కొందరు వ్యక్తులకు అప్పగించటం. ఆంగ్లంలో దీనినే ట్రస్ట్ అంటారు. ఉదాహరణకు ఒక దేవాలయాన్ని కట్టించి, ఆ దేవాలయానికి అనుబంధంగా కొంత పొలాన్ని కేటాయించి, ఆ పొలంపై వచ్చే ఆదాయంతో దేవాలయ నిర్వహణ జరిగేలా ఏర్పాటు చేయటం. అందు నిమిత్తం ఒక వ్యక్తి లేక కొందరు వ్యక్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేయటం. ఆ కమిటీనే ట్రస్టు అంటారు. ఆ ట్రస్టు నిర్వాహకుడు, లేక నిర్వాహకులను ధర్మకర్త లేక ధర్మకర్తలు అంటారు. ఆంగ్లంలో ట్రస్టీ అంటారు.
అయితే ట్రస్టు ప్రధానంగా రెండు రకాలు. విస్తృత జనబాహుళ్యానికి ఉపయోగపడేవి ఒక రకమైన ట్రస్టులు. వీటిని పబ్లిక్ ట్రస్టులు అంటారు. కేవలం ఒక వ్యక్తి లేక కొద్దిమంది వ్యక్తులు, లేక ఒక కుటుంబం సంరక్షణ, ప్రయోజనం కోససం ఏర్పడే ట్రస్టులు మరో రకం. వీటిని ప్రయివేటు ట్రస్టులు అంటారు.
ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న 'భారతీయ ధర్మ సంస్థల చట్టం' పూర్తిగా ప్రయివేటు ట్రస్టులకు సంబంధించినది. పబ్లిక్ ట్రస్టుల పరిధితో పోలిస్తే, ఈ ప్రయివేటు ట్రస్టుల పరిధి పరిమితమే అని చెప్పక తప్పదు. అంతమాత్రాన ప్రయివేటు ట్రస్టుల ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయకూడదు. అందువలన ట్రస్టులను అధ్యయనం చేసే క్రమంలో ప్రయివేటు ట్రస్టుల పరిధి, వ్యవస్థీకరణ, నిర్వహణ తదితర అంశాలను గురించి తెలుసుకోవటం చాలా అవసరం. అందుకు ఈ పుస్తకం ఉపకరిస్తుందని నా ఆకాంక్ష.
- పెండ్యాల సత్యనారాయణ
దాన ధర్మాలు మన జీవన స్రవంతిలో ఒక భాగం. ఆటవిక దశను మినహాయిస్తే, బానిస సమాజం నుండి ఇప్పటిదాకా దాన ధర్మాలు మానవ సమాజంతోబాటు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఇక్కడ దానధర్మాలు అంటే ప్రజాహితం కోసం వితరణ అని అర్థం. అంటే కొంత ఆస్తిని, ఒక ప్రజాహిత కార్యంకోసం వినియోగించటం. ఆ బాధ్యతను, సదరు ఆస్తి సంరక్షణను ఒక వ్యక్తి, లేక కొందరు వ్యక్తులకు అప్పగించటం. ఆంగ్లంలో దీనినే ట్రస్ట్ అంటారు. ఉదాహరణకు ఒక దేవాలయాన్ని కట్టించి, ఆ దేవాలయానికి అనుబంధంగా కొంత పొలాన్ని కేటాయించి, ఆ పొలంపై వచ్చే ఆదాయంతో దేవాలయ నిర్వహణ జరిగేలా ఏర్పాటు చేయటం. అందు నిమిత్తం ఒక వ్యక్తి లేక కొందరు వ్యక్తులతో ఒక కమిటీని ఏర్పాటు చేయటం. ఆ కమిటీనే ట్రస్టు అంటారు. ఆ ట్రస్టు నిర్వాహకుడు, లేక నిర్వాహకులను ధర్మకర్త లేక ధర్మకర్తలు అంటారు. ఆంగ్లంలో ట్రస్టీ అంటారు. అయితే ట్రస్టు ప్రధానంగా రెండు రకాలు. విస్తృత జనబాహుళ్యానికి ఉపయోగపడేవి ఒక రకమైన ట్రస్టులు. వీటిని పబ్లిక్ ట్రస్టులు అంటారు. కేవలం ఒక వ్యక్తి లేక కొద్దిమంది వ్యక్తులు, లేక ఒక కుటుంబం సంరక్షణ, ప్రయోజనం కోససం ఏర్పడే ట్రస్టులు మరో రకం. వీటిని ప్రయివేటు ట్రస్టులు అంటారు. ఇప్పుడు మీ చేతుల్లో ఉన్న 'భారతీయ ధర్మ సంస్థల చట్టం' పూర్తిగా ప్రయివేటు ట్రస్టులకు సంబంధించినది. పబ్లిక్ ట్రస్టుల పరిధితో పోలిస్తే, ఈ ప్రయివేటు ట్రస్టుల పరిధి పరిమితమే అని చెప్పక తప్పదు. అంతమాత్రాన ప్రయివేటు ట్రస్టుల ప్రాముఖ్యతను తక్కువగా అంచనా వేయకూడదు. అందువలన ట్రస్టులను అధ్యయనం చేసే క్రమంలో ప్రయివేటు ట్రస్టుల పరిధి, వ్యవస్థీకరణ, నిర్వహణ తదితర అంశాలను గురించి తెలుసుకోవటం చాలా అవసరం. అందుకు ఈ పుస్తకం ఉపకరిస్తుందని నా ఆకాంక్ష. - పెండ్యాల సత్యనారాయణ© 2017,www.logili.com All Rights Reserved.