శాస్త్రం విజ్ఞానదాయకమనీ, సాహిత్యం కళాత్మకమనీ భావిస్తారు. మానవజ్ఞాన సంపదను శాస్త్రమనీ, కళ అనీ రెండుగా విభజించిన విద్వాంసుడు వాత్సాయనుడు. ఆ మహర్షి రాసిన గ్రంథం 'కళాశాస్త్రం'. శాస్త్ర విషయాలను ఆనందమయ జీవిత సాధనకు అనువర్తించే విశదీకరణ కనిపిస్తుంది. రెండిటికీ అవినాభావ సంబంధం ఉన్నది. ఇటువంటి సమయంలో సాహితీ, విజ్ఞానాల మధ్యగల పరస్పర సంబంధాలనూ, ప్రభావాలనూ వివరించే సిద్ధాంత గ్రంథ రచనకు పూనుకున్న ఆచార్య చందు సుబ్బారావును అభినందిస్తున్నాను. వేదర్షులు భౌతికాధ్యాత్మిక విచారాలు రెండూ చేశారు. కావ్య రచనకు లోకశాస్త్రాధ్యవీక్షణం కావాలన్నారు. మానవజాతి పరిణామక్రమంలో సాహిత్య శాస్త్ర విజ్ఞానాలు ఏ విధంగా సహకరించుకున్నాయో, ఆ సహకారం ఏ విధంగా అనివార్యమో, ఆవశ్యకమో సుబ్బారావుగారు ఈ గ్రంథంలో విశదీకరించారు.
శాస్త్రం విజ్ఞానదాయకమనీ, సాహిత్యం కళాత్మకమనీ భావిస్తారు. మానవజ్ఞాన సంపదను శాస్త్రమనీ, కళ అనీ రెండుగా విభజించిన విద్వాంసుడు వాత్సాయనుడు. ఆ మహర్షి రాసిన గ్రంథం 'కళాశాస్త్రం'. శాస్త్ర విషయాలను ఆనందమయ జీవిత సాధనకు అనువర్తించే విశదీకరణ కనిపిస్తుంది. రెండిటికీ అవినాభావ సంబంధం ఉన్నది. ఇటువంటి సమయంలో సాహితీ, విజ్ఞానాల మధ్యగల పరస్పర సంబంధాలనూ, ప్రభావాలనూ వివరించే సిద్ధాంత గ్రంథ రచనకు పూనుకున్న ఆచార్య చందు సుబ్బారావును అభినందిస్తున్నాను. వేదర్షులు భౌతికాధ్యాత్మిక విచారాలు రెండూ చేశారు. కావ్య రచనకు లోకశాస్త్రాధ్యవీక్షణం కావాలన్నారు. మానవజాతి పరిణామక్రమంలో సాహిత్య శాస్త్ర విజ్ఞానాలు ఏ విధంగా సహకరించుకున్నాయో, ఆ సహకారం ఏ విధంగా అనివార్యమో, ఆవశ్యకమో సుబ్బారావుగారు ఈ గ్రంథంలో విశదీకరించారు.© 2017,www.logili.com All Rights Reserved.