Title | Price | |
Kanyasulkam | Rs.200 | In Stock |
Kanyasulkam | Rs.120 | In Stock |
Kanyasulkam | Rs.125 | In Stock |
"మాట్లాడినట్టే సరిగ్గా రాయడం కూడా ఎవరికి సాధ్యం? అధవా రాసినప్పటికీ అందులో ఏమి పస వుంటుంది?" అనే వారికి కన్యాశుల్కంలోని ప్రతీవాక్యమూ, ప్రతీమాటా తిరుగులేని జవాబిస్తాయి. సామాజిక వాస్తవికతను కన్యాశుల్కం ప్రతిబింబించినంత సంపూర్ణంగా మనదేశంలోని మరే ఇతర నాటకమూ ప్రతిబింబించలేదని నిస్సందేహంగా చెప్పవచ్చును. సంఘంలోని వివిధ వర్గాలకు, కులాలకు, వ్యక్తులకు, మనఃప్రవృత్తులకు చెందిన ఎందరో వ్యక్తులు నిత్యజీవితంలో తాము ఎలాగ మాట్లాడతారో, అలానే కన్యాశుల్కంలో మాట్లాడతారు.
-శ్రీశ్రీ
కథకూ కథనానికీ అవసరమైన దృశ్యాలనూ, సంభాషణలనూ మాత్రమే 'పరిమితంగా' తీసుకుని ఉంటే 'కన్యాశుల్కం' ఒక నాటకంగా మాత్రమే మనకు గుర్తుండేది. అందుకు భిన్నంగా, ఒక నిర్దిష్ట ప్రాంతంలో, ఒక నిర్దిష్ట కాలంలో, ఉన్న సామాజిక భావాల రాశి 'కన్యాశుల్కం'లో మనకు పుష్కలంగా లభిస్తోంది. కనుకనే దాన్ని మనం జీవితంలో భాగంగా చూడాల్సి వస్తోంది. ఆంద్రదేశపు సాంఘిక చరిత్ర రాయడానికి ముఖ్యంగా కళింగాంద్ర చరిత్ర - కన్యాశుల్కం ఒక ఆధారంగా పనికి వస్తుంది. ఈ సందర్భంలో, గురజాడ 'కళింగాంద్రదేశ చరిత్ర' రాశాడని గుర్తు పెట్టుకోవడం మరింత అవసరం. నడుస్తున్న చరిత్రను 'కన్యాశుల్కం' అక్షరబద్ధం చేసింది.
- హరి పురుషోత్తమరావు
"మాట్లాడినట్టే సరిగ్గా రాయడం కూడా ఎవరికి సాధ్యం? అధవా రాసినప్పటికీ అందులో ఏమి పస వుంటుంది?" అనే వారికి కన్యాశుల్కంలోని ప్రతీవాక్యమూ, ప్రతీమాటా తిరుగులేని జవాబిస్తాయి. సామాజిక వాస్తవికతను కన్యాశుల్కం ప్రతిబింబించినంత సంపూర్ణంగా మనదేశంలోని మరే ఇతర నాటకమూ ప్రతిబింబించలేదని నిస్సందేహంగా చెప్పవచ్చును. సంఘంలోని వివిధ వర్గాలకు, కులాలకు, వ్యక్తులకు, మనఃప్రవృత్తులకు చెందిన ఎందరో వ్యక్తులు నిత్యజీవితంలో తాము ఎలాగ మాట్లాడతారో, అలానే కన్యాశుల్కంలో మాట్లాడతారు. -శ్రీశ్రీ కథకూ కథనానికీ అవసరమైన దృశ్యాలనూ, సంభాషణలనూ మాత్రమే 'పరిమితంగా' తీసుకుని ఉంటే 'కన్యాశుల్కం' ఒక నాటకంగా మాత్రమే మనకు గుర్తుండేది. అందుకు భిన్నంగా, ఒక నిర్దిష్ట ప్రాంతంలో, ఒక నిర్దిష్ట కాలంలో, ఉన్న సామాజిక భావాల రాశి 'కన్యాశుల్కం'లో మనకు పుష్కలంగా లభిస్తోంది. కనుకనే దాన్ని మనం జీవితంలో భాగంగా చూడాల్సి వస్తోంది. ఆంద్రదేశపు సాంఘిక చరిత్ర రాయడానికి ముఖ్యంగా కళింగాంద్ర చరిత్ర - కన్యాశుల్కం ఒక ఆధారంగా పనికి వస్తుంది. ఈ సందర్భంలో, గురజాడ 'కళింగాంద్రదేశ చరిత్ర' రాశాడని గుర్తు పెట్టుకోవడం మరింత అవసరం. నడుస్తున్న చరిత్రను 'కన్యాశుల్కం' అక్షరబద్ధం చేసింది. - హరి పురుషోత్తమరావు© 2017,www.logili.com All Rights Reserved.