కూనేటిగెడ్డ
ఇది కూనేటిగెడ్డ అంటే, అప్పలనాయుడికి నమ్మశక్యంగా లేదు. ఇసుక లేకపోగా, నేలంతా గట్టిగా, పొడిగా, ఎగుడుదిగుడుగా ఉంది. రెండు ప్రక్కలా, గట్ల మీద అడ్డదిడ్డంగా మొక్కలూ, ముళ్ళపొదలూ పెరిగిపోయేయి. తన చిన్నప్పుడు రెండు ఎద్దులబళ్ళు ఎదురెదురుగా వెళ్ళగలిగే వెడల్పున సమతలంగా ఇసుకతో ఉండేది. ఇప్పుడు ఇరుకు గోర్జిలా తయారయి, ముళ్ళపొదలు గెడ్డని ఆక్రమించేసాయి. గెడ్డ దాటేచోట తప్ప, ముళ్ళకంపలు గీసుకోకుండా గెడ్డ లోపలి నుండీ మనిషి నడవలేని పరిస్థితి ఉంది. ఒకవేళ పొదలు తొలగించినా, సైకిలు కూడా వెళ్ళలేనంత అడ్డదిడ్డంగా ఉంది ఆ నేల. పొడిబారిన నేలలో అక్కడక్కడా పాదం మునిగే లోతులో నాచు కట్టిన నీరు. తన చిన్నతనంలో ఏడాదికీ ఎనిమిది నెలలు గలగలా పారుతూ తాగగలిగేంత తేటనీరు ఉండే సెలయేరేనా, ఇప్పుడు చూస్తున్నది? ఈ నాచు కట్టిన నీరు వొంటికి తగిలితేనే దద్దుర్లు వచ్చేలా ఉందే. అప్పుడు గుర్తొచ్చింది... తాను కూనేటిగెడ్డని చూసి పదేళ్ళు దాటింది. ఈ పదేళ్ళూ, వందల కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఊరు వచ్చాడుగానీ, ఈ అరమైలూ దాటి ఇక్కడికి రాలేదా? ఒక్కో విషయం స్ఫురిస్తూ ఉంటే, అప్పలనాయుడు తెల్లబోయాడు.
తెల్లబోవటానికి కారణాలు తెలియాలంటే ఇరవై ఏళ్ళకిపైగా వెనక్కి వెళ్ళాలి..........
కూనేటిగెడ్డ ఇది కూనేటిగెడ్డ అంటే, అప్పలనాయుడికి నమ్మశక్యంగా లేదు. ఇసుక లేకపోగా, నేలంతా గట్టిగా, పొడిగా, ఎగుడుదిగుడుగా ఉంది. రెండు ప్రక్కలా, గట్ల మీద అడ్డదిడ్డంగా మొక్కలూ, ముళ్ళపొదలూ పెరిగిపోయేయి. తన చిన్నప్పుడు రెండు ఎద్దులబళ్ళు ఎదురెదురుగా వెళ్ళగలిగే వెడల్పున సమతలంగా ఇసుకతో ఉండేది. ఇప్పుడు ఇరుకు గోర్జిలా తయారయి, ముళ్ళపొదలు గెడ్డని ఆక్రమించేసాయి. గెడ్డ దాటేచోట తప్ప, ముళ్ళకంపలు గీసుకోకుండా గెడ్డ లోపలి నుండీ మనిషి నడవలేని పరిస్థితి ఉంది. ఒకవేళ పొదలు తొలగించినా, సైకిలు కూడా వెళ్ళలేనంత అడ్డదిడ్డంగా ఉంది ఆ నేల. పొడిబారిన నేలలో అక్కడక్కడా పాదం మునిగే లోతులో నాచు కట్టిన నీరు. తన చిన్నతనంలో ఏడాదికీ ఎనిమిది నెలలు గలగలా పారుతూ తాగగలిగేంత తేటనీరు ఉండే సెలయేరేనా, ఇప్పుడు చూస్తున్నది? ఈ నాచు కట్టిన నీరు వొంటికి తగిలితేనే దద్దుర్లు వచ్చేలా ఉందే. అప్పుడు గుర్తొచ్చింది... తాను కూనేటిగెడ్డని చూసి పదేళ్ళు దాటింది. ఈ పదేళ్ళూ, వందల కిలోమీటర్లు ప్రయాణించి ఈ ఊరు వచ్చాడుగానీ, ఈ అరమైలూ దాటి ఇక్కడికి రాలేదా? ఒక్కో విషయం స్ఫురిస్తూ ఉంటే, అప్పలనాయుడు తెల్లబోయాడు. తెల్లబోవటానికి కారణాలు తెలియాలంటే ఇరవై ఏళ్ళకిపైగా వెనక్కి వెళ్ళాలి..........© 2017,www.logili.com All Rights Reserved.