లండన్ టు అమరావతి
ఆసేతు హిమాచల భారతదేశ యువత తమతమ ప్రాంతీయ సంప్రదాయ దుస్తులలో ఆసీనులైన ఆ ఆడిటోరియం సీతాకోకచిలుక అందమైన రెక్కలను పోలి ఉంది. 2400 సీటింగ్ కెపాసిటీ, సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ డైక్ మన్ ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. గత నాలుగురోజులుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరుగుతున్న అఖిలభారత విశ్వవిద్యాలయ యువజనోత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. వైసాన్సలర్ అధికారులతో ఆనాటి ముఖ్యఅతిథి, అమరావతి మేయర్, లారెన్స్ రాజన్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామాత్యులు అమరావతి పర్యటన కారణంగా మేయర్ రాక ఆలస్యమైంది. ఆడిటోరియంలోకి ప్రవేశిస్తున్న మేయర్ను ఉపకులపతి సాదరంగా ఆహ్వానించారు. గత నాలుగు రోజులుగా అనేక సాంఘిక, సాంస్కృతిక పోటీలలో పాల్గొని ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందకుపైగా విశ్వవిద్యాలయ విద్యార్థులున్నారు. ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతదేశానికి సంబంధించిన అన్ని ముఖ్య విశ్వవిద్యాలయ విద్యార్థులు గత నాలుగురోజులుగా ఇక్కడ చేసిన సందడి అంతా, ఇంతా కాదు. సంప్రదాయ, ఆధునిక కలయికలతో వారు చేసిన నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, సాహిత్యం, డాక్యుమెంటరీలు నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్థులను, అమరావతి ప్రజలను మంత్రముగ్ధులను చేసాయి. క్యాంపస్ లో 600 సీట్ల కెపాసిటీ గల ఎనిమిది ఆడిటోరియంలలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నాలుగురోజులుగా అక్కడ జరిగింది కళాజాతరే. రెండవ నంబర్ గేలరీలో ఒకమూల కూర్చున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం విద్యార్థులు తాము ప్రదర్శించిన 'అమరావతి, డౌన్ టు ఎర్త్' అనే డాక్యుమెంటరీకి ఒక బహుమతి అయినా రాకపోతుందా అని ఆశతో ఎదురుచూస్తున్నారు..............
లండన్ టు అమరావతి ఆసేతు హిమాచల భారతదేశ యువత తమతమ ప్రాంతీయ సంప్రదాయ దుస్తులలో ఆసీనులైన ఆ ఆడిటోరియం సీతాకోకచిలుక అందమైన రెక్కలను పోలి ఉంది. 2400 సీటింగ్ కెపాసిటీ, సెంట్రల్ ఎయిర్ కండిషన్డ్ డైక్ మన్ ఆడిటోరియం కిక్కిరిసిపోయింది. గత నాలుగురోజులుగా ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరుగుతున్న అఖిలభారత విశ్వవిద్యాలయ యువజనోత్సవాలు తుది అంకానికి చేరుకున్నాయి. వైసాన్సలర్ అధికారులతో ఆనాటి ముఖ్యఅతిథి, అమరావతి మేయర్, లారెన్స్ రాజన్ రాక కోసం ఎదురుచూస్తున్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖామాత్యులు అమరావతి పర్యటన కారణంగా మేయర్ రాక ఆలస్యమైంది. ఆడిటోరియంలోకి ప్రవేశిస్తున్న మేయర్ను ఉపకులపతి సాదరంగా ఆహ్వానించారు. గత నాలుగు రోజులుగా అనేక సాంఘిక, సాంస్కృతిక పోటీలలో పాల్గొని ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వందకుపైగా విశ్వవిద్యాలయ విద్యార్థులున్నారు. ఉత్తర, దక్షిణ, ఈశాన్య భారతదేశానికి సంబంధించిన అన్ని ముఖ్య విశ్వవిద్యాలయ విద్యార్థులు గత నాలుగురోజులుగా ఇక్కడ చేసిన సందడి అంతా, ఇంతా కాదు. సంప్రదాయ, ఆధునిక కలయికలతో వారు చేసిన నృత్యం, సంగీతం, చిత్రలేఖనం, సాహిత్యం, డాక్యుమెంటరీలు నాగార్జున విశ్వవిద్యాలయ విద్యార్థులను, అమరావతి ప్రజలను మంత్రముగ్ధులను చేసాయి. క్యాంపస్ లో 600 సీట్ల కెపాసిటీ గల ఎనిమిది ఆడిటోరియంలలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు నాలుగురోజులుగా అక్కడ జరిగింది కళాజాతరే. రెండవ నంబర్ గేలరీలో ఒకమూల కూర్చున్న ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జర్నలిజం విద్యార్థులు తాము ప్రదర్శించిన 'అమరావతి, డౌన్ టు ఎర్త్' అనే డాక్యుమెంటరీకి ఒక బహుమతి అయినా రాకపోతుందా అని ఆశతో ఎదురుచూస్తున్నారు..............© 2017,www.logili.com All Rights Reserved.