ఒకసారి తాతగారు మా నాయనగారితో ‘నాయనా, శ్రీనాథులవారు శతాధిక గ్రంథకర్త. వాటిలో మనకిప్పుడెన్ని లభ్యమగుచున్నవో తెలుసునుకదా. ఒక మహాకవి తన సర్వ జీవితమును ఒకానొక మహా సంకల్పముతో కొనసాగించును. కాబట్టి తత్కవి చేసిన మహా ప్రయత్నము లోకమునందు బ్రతికివుండవలెనంటే, తత్కవి తదనంతరమున కూడా వాటిని పారంపర్యముగా లోకమునకు అందించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదని అన్నారట.
1976లో తాతగారు కాలము చేయునాటికి వారి రచనలలో సగమునకు సగముపై మావద్ద కాపీరైట్స్ లేవు. వాటినన్నింటిని మరల సంపాదించి తిరిగి కొలువునకు చేర్చునప్పటికి పాతిక ముప్పై సంవత్సరముల కాలము పట్టినది. విశ్వనాధ వారివి మొత్తము 118 రచనలు. అందులో 57 నవలలు, అందులో ‘మా బాబు’ అను నవల 1935 లో రచింపబడినది, ఇది పదకొండవ ముద్రణ. ‘హాహాహూహూ’ అను నవల 1952 లో రచింపబడినది. ఇది తొమ్మిదవ ముద్రణ.
- విశ్వనాథ సత్యనారాయణ
© 2017,www.logili.com All Rights Reserved.