ఆదిమ కాలం నుండి మనిషి ప్రకృతితో స్నేహం చేస్తూ, ప్రకృతితో పోరాటం చేస్తూ తన మనుగడ సాగిస్తున్నాడు. ప్రకృతిని తన అవసరాలకు ఉపయోగించుకుంటూ, ప్రకృతికి తను ఉపయోగపడుతూ వస్తున్నాడు. నిజానికి మనిషి ప్రకృతిలో అంతర్భాగం. ప్రకృతిలోని జీవరాశిని విభజించినప్పుడు మనుషులు, పశువులు, పక్షులు, పురుగులు, చెట్టూ, పుట్ట, గుట్ట అనేవి ఏర్పడతాయి. ప్రకృతిలో ఒక భాగమైన మానవుడు మరో భాగమైన జంతువును మచ్చిక చేసుకున్న కథే 'జిగిరి' నవల.
జంతువులు, పురుగులు అనేక సందర్భాలలో ప్రశంసాత్మకంగానో, విమర్శనాత్మకంగానో ఉపమానాలు అవుతున్నాయి. మంచి మనిషిని గోవులాంటి వాడు అంటారు. కోపంతో ఒక మనిషి మరో మనిషిని తీవ్రంగా కొట్టినప్పుడు గొడ్డును బాదినట్లు బాదాడు అంటారు. కుక్కను కొట్టినట్లు కొట్టారంటారు. తిండి ఎక్కువగా తినే మనిషిని పందిలా తింటాడు అంటారు. తెలిసో తెలియకో ఒక మనిషి మరో మనిషి మీద పడితే దున్నపోతూ అంటారు. ఎన్నిసార్లు చెప్పినా ప్రవర్తన మార్చుకోని వానితో మనిషికొక మాట, గొడ్డుకొక దెబ్బ అంటారు. అమానుషంగా ప్రవర్తించే మనిషిని మనిషివా? పశువువా?................
పాత కొత్తల మధ్య ఘర్షణ జిగిరి ఆదిమ కాలం నుండి మనిషి ప్రకృతితో స్నేహం చేస్తూ, ప్రకృతితో పోరాటం చేస్తూ తన మనుగడ సాగిస్తున్నాడు. ప్రకృతిని తన అవసరాలకు ఉపయోగించుకుంటూ, ప్రకృతికి తను ఉపయోగపడుతూ వస్తున్నాడు. నిజానికి మనిషి ప్రకృతిలో అంతర్భాగం. ప్రకృతిలోని జీవరాశిని విభజించినప్పుడు మనుషులు, పశువులు, పక్షులు, పురుగులు, చెట్టూ, పుట్ట, గుట్ట అనేవి ఏర్పడతాయి. ప్రకృతిలో ఒక భాగమైన మానవుడు మరో భాగమైన జంతువును మచ్చిక చేసుకున్న కథే 'జిగిరి' నవల. జంతువులు, పురుగులు అనేక సందర్భాలలో ప్రశంసాత్మకంగానో, విమర్శనాత్మకంగానో ఉపమానాలు అవుతున్నాయి. మంచి మనిషిని గోవులాంటి వాడు అంటారు. కోపంతో ఒక మనిషి మరో మనిషిని తీవ్రంగా కొట్టినప్పుడు గొడ్డును బాదినట్లు బాదాడు అంటారు. కుక్కను కొట్టినట్లు కొట్టారంటారు. తిండి ఎక్కువగా తినే మనిషిని పందిలా తింటాడు అంటారు. తెలిసో తెలియకో ఒక మనిషి మరో మనిషి మీద పడితే దున్నపోతూ అంటారు. ఎన్నిసార్లు చెప్పినా ప్రవర్తన మార్చుకోని వానితో మనిషికొక మాట, గొడ్డుకొక దెబ్బ అంటారు. అమానుషంగా ప్రవర్తించే మనిషిని మనిషివా? పశువువా?................© 2017,www.logili.com All Rights Reserved.