Title | Price | |
Mana Telugu Navalalu | Rs.250 | Out of Stock |
మన తెలుగు నవలలు ప్రారంభం - పరిణామక్రమం - సమాజంపై సాహిత్యంపై నవ లు కలిగించిన ప్రభావం (1872 - 2010)
ఒకజాతి సంస్కృతిని తెలుసుకోవటానికి నవల అత్యుత్తమ సాధనం, తెలుగులో నవలా రచన ప్రారంభమైన (క్రీ.శ. 1872) ప్పటి నుండి ఇప్పటి దాకా (క్రీ.శ. 2010) వచ్చిన తెలుగు నవలల్ని పరిశీలిస్తే తెలుగు జాతి చరిత్ర, సంస్కృతి వివరంగా తెలుస్తాయి. ఈ కాలంలో తెలుగు ప్రజల జీవన గమనం, సమాజంలో ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పులు, సామాజిక సంఘటనలను సాహిత్యం ప్రతిబింబించిన తీరు అవగత మవుతాయి.
ఉత్తరాంధ్ర, కోస్తా , రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలోని ప్రజల జీవితం - ఆయా ప్రాంతాల పైరు పచ్చలు, వివిధ వృత్తుల పనివాండ్ల జీవితపు వెలుగు నీడలు, ఆయా ప్రాంతాల ప్రజల భాష (పలుకుబళ్ళు,
జాతీయాలు, సామెతలు, శైలి) రాజకీయ సామాజిక సంఘటనలకు ప్రజలు స్పందించిన తీరు ఇంకా పండుగలు, పబ్బాలు, కరువులు, ఆకలియాత్రలు, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతు కూలీ పోరాటాలు, సాయుధ విప్లవ ఉత్థానపతనాలు, స్త్రీవాద చైతన్యమూ, దళితుల ఆత్మగౌరవ పోరాటాలు, క్రైస్తవ, ముస్లిం మైనారిటీల సమస్యలు, విదేశాలకు వలసలు, దూరదేశాలలో తెలుగు ప్రజల జీవితమూ మొదలైన ఎన్నో విషయాలను తెలుగు నవలా రచయితలు ప్రస్తావించారు.
తెలుగు నవలా రచయితలు ఏయే అంశాలపై తమ దృష్టిని ఎక్కువగా ప్రసరించినది, ఏయే అంశాలను రేఖామాత్రంగా స్పృశించినదీ, ఏ అంశాలను బొత్తిగా విస్మరించినదీ తెలియజేసే ప్రయత్నమే యీ తెలుగు సాంఘిక నవలా వికాసం - సమాజంపై ప్రభావం. తెలుగు నవల ప్రారంభం:
భారతీయ భాషలలో నవలారచన క్రీ.శ. 19వ శతాబ్దం ద్వితీయార్థంలో ప్రారంభమైంది. క్రీ.శ. 1865లో బంకించంద్ర ఛటర్జీ రచించిన బెంగాలీనవల 'దుర్దేశనందినిని భారతీయ భాషలలో వచ్చిన మొదటి నవలగా సాహిత్య చరిత్రకారులు పరిగణిస్తున్నారు.
దురేశనందిని' వచ్చిన కొద్ది సంవత్సరాలలోనే క్రీ.శ. 1872లో తెలుగులో తొలి నవల వెలువడింది. నరహరి గోపాలకృష్ణమసెట్టి రచించిన శ్రీరంగరాజు చరిత్ర తెలుగులో వచ్చిన మొదటి నవల.
కొండ వేంకటరత్నంగారి మహాశ్వేత (క్రీ.శ. 1867 ను తెలుగులో తొలి నవలగా కొందరు అరకులు తలచారు గాని ఆ వచన రచన బాణ మహాకవి కాదంబం లోని మహాత మతాంతానికి అనుసరణమే. ఇది స్వతంత్ర రచన కాదు. రచయిత సొంతంగా చేసిన కల నీ ఇందులో లేవు. ఆధునిక నవల లక్షణాలు ఇందులో లేవు, వైస్రాయ్ లారు మేయో బెంగాలీ..................
మన తెలుగు నవలలు ప్రారంభం - పరిణామక్రమం - సమాజంపై సాహిత్యంపై నవ లు కలిగించిన ప్రభావం (1872 - 2010) ఒకజాతి సంస్కృతిని తెలుసుకోవటానికి నవల అత్యుత్తమ సాధనం, తెలుగులో నవలా రచన ప్రారంభమైన (క్రీ.శ. 1872) ప్పటి నుండి ఇప్పటి దాకా (క్రీ.శ. 2010) వచ్చిన తెలుగు నవలల్ని పరిశీలిస్తే తెలుగు జాతి చరిత్ర, సంస్కృతి వివరంగా తెలుస్తాయి. ఈ కాలంలో తెలుగు ప్రజల జీవన గమనం, సమాజంలో ప్రజల ఆలోచనల్లో వచ్చిన మార్పులు, సామాజిక సంఘటనలను సాహిత్యం ప్రతిబింబించిన తీరు అవగత మవుతాయి. ఉత్తరాంధ్ర, కోస్తా , రాయలసీమ, తెలంగాణ ప్రాంతాలలోని ప్రజల జీవితం - ఆయా ప్రాంతాల పైరు పచ్చలు, వివిధ వృత్తుల పనివాండ్ల జీవితపు వెలుగు నీడలు, ఆయా ప్రాంతాల ప్రజల భాష (పలుకుబళ్ళు, జాతీయాలు, సామెతలు, శైలి) రాజకీయ సామాజిక సంఘటనలకు ప్రజలు స్పందించిన తీరు ఇంకా పండుగలు, పబ్బాలు, కరువులు, ఆకలియాత్రలు, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు, రైతు కూలీ పోరాటాలు, సాయుధ విప్లవ ఉత్థానపతనాలు, స్త్రీవాద చైతన్యమూ, దళితుల ఆత్మగౌరవ పోరాటాలు, క్రైస్తవ, ముస్లిం మైనారిటీల సమస్యలు, విదేశాలకు వలసలు, దూరదేశాలలో తెలుగు ప్రజల జీవితమూ మొదలైన ఎన్నో విషయాలను తెలుగు నవలా రచయితలు ప్రస్తావించారు. తెలుగు నవలా రచయితలు ఏయే అంశాలపై తమ దృష్టిని ఎక్కువగా ప్రసరించినది, ఏయే అంశాలను రేఖామాత్రంగా స్పృశించినదీ, ఏ అంశాలను బొత్తిగా విస్మరించినదీ తెలియజేసే ప్రయత్నమే యీ తెలుగు సాంఘిక నవలా వికాసం - సమాజంపై ప్రభావం. తెలుగు నవల ప్రారంభం: భారతీయ భాషలలో నవలారచన క్రీ.శ. 19వ శతాబ్దం ద్వితీయార్థంలో ప్రారంభమైంది. క్రీ.శ. 1865లో బంకించంద్ర ఛటర్జీ రచించిన బెంగాలీనవల 'దుర్దేశనందినిని భారతీయ భాషలలో వచ్చిన మొదటి నవలగా సాహిత్య చరిత్రకారులు పరిగణిస్తున్నారు. దురేశనందిని' వచ్చిన కొద్ది సంవత్సరాలలోనే క్రీ.శ. 1872లో తెలుగులో తొలి నవల వెలువడింది. నరహరి గోపాలకృష్ణమసెట్టి రచించిన శ్రీరంగరాజు చరిత్ర తెలుగులో వచ్చిన మొదటి నవల. కొండ వేంకటరత్నంగారి మహాశ్వేత (క్రీ.శ. 1867 ను తెలుగులో తొలి నవలగా కొందరు అరకులు తలచారు గాని ఆ వచన రచన బాణ మహాకవి కాదంబం లోని మహాత మతాంతానికి అనుసరణమే. ఇది స్వతంత్ర రచన కాదు. రచయిత సొంతంగా చేసిన కల నీ ఇందులో లేవు. ఆధునిక నవల లక్షణాలు ఇందులో లేవు, వైస్రాయ్ లారు మేయో బెంగాలీ..................© 2017,www.logili.com All Rights Reserved.