మొగలాయి దర్బార్ చారిత్రక నవలకి ప్రాచీన నేపధ్యం ఉంది. అలంటి వైభవం ఉంది ఒకనాటి రాచరిక దౌష్ట్యాలున్నాయి. మాయలు, మంత్రాలూ, కుతంత్రాలు ఇమిడి ఉన్నాయి. టక్కుటమార, గజకర్ణ గోకర్ణ విద్యలు, వాటి ప్రయోగ ఉపసంహారాలు ఉత్కంఠ భరితంగా కళ్ళకు కట్టించే సందర్భాలు అడుగడుగునా కన్పించి గగుర్పొడుస్తాయి. ఇది ఒకనాడు భరతభూమి పై జరిగిన కథ. ఇందులో వచ్చే పాత్రలన్నీ మనకు సుపరిచితమైనవే. కానీ ఇందులో మనం చదివే ఇతిహాసం నడిచే తీరు నవరస భరితంగా ఉంటుంది. ప్రతి సన్నివేశం ఆసక్తిని రేపుతూ, ఆపడానికి వీలులేని జవనాశ్వపు పరుగుతో సాగుతుంది. మొగలాయి దర్బార్ నవలకి అనేక పార్శ్వాలున్నాయి. అన్ని రామణీయాలే! సుదీర్ఘ చరిత్రను కుదించి పట్టు జారకుండా చెప్పిన విధానం ఒక చక్కని ప్రయోగం ఆస్వాదించండి. - నేతి సూర్యనారాయణ శర్మ