ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా పాలకవర్గం పాలితవర్గం నడుమ పోరాటమంటూ ప్రారంభమయితే నాటి పరిస్థితుల అనుకూల్యతను అనుసరించి అంతిమ విజయం ఉంటుంది. ఇది చారిత్రిక సత్యం. అలాంటి సత్యావిష్కరణకు సృజన రూపం 'మృత్యుంజయులు' నవల.
వ్యవస్థ పరిణామ క్రమంలో సామాజిక స్థితిగతులను బట్టి పాలకులు ప్రజల్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు, అణచిపెట్టేందుకు సామ దాన భేద దండోపాయాలను అనుసరిస్తారు. ప్రజల అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని, నిస్సహాయతను ఆసరాగా చేసుకొని గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యల్ని ప్రదర్శిస్తూ సాగినంత కాలం పాలన సాగిస్తారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. దోపిడీ, పీడనలకు మేలిముసుగులో తోడుగుతున్నారు. కులం, మతం, ప్రాంతం, నేటి పాలకులకు కలసివచ్చిన అంశాలయ్యాయి. దుర్మార్గమైన 'కేవల ఆర్ధిక సంబంధాల సంస్కృతి'ని జనం నెత్తిన రుద్దుతున్నారు. ప్రజల మనసుల్ని గెలుచుకోడానికి వారికి కావలసినంత బంధుజనం, సాంకేతిక నిపుణులగణం, అర్థబలం ఉంది. అదే వారి ధీమా. ఈ ధీమా ఎల్లకాలం చెల్లదు. ఇవేవీ వారికి శాశ్వత రక్షణ కవచాలు కావు. ప్రజలు చైతన్యవంతులయ్యేవరకే ఈ ఆటలన్నీ.
ఈ జనంలోంచే వస్తారు పోరాటయోధులు - 'మృత్యుంజయులు'.
ఏ కాలంలోనైనా, ఏ దేశంలోనైనా, ఏ వ్యవస్థలోనైనా పాలకవర్గం పాలితవర్గం నడుమ పోరాటమంటూ ప్రారంభమయితే నాటి పరిస్థితుల అనుకూల్యతను అనుసరించి అంతిమ విజయం ఉంటుంది. ఇది చారిత్రిక సత్యం. అలాంటి సత్యావిష్కరణకు సృజన రూపం 'మృత్యుంజయులు' నవల. వ్యవస్థ పరిణామ క్రమంలో సామాజిక స్థితిగతులను బట్టి పాలకులు ప్రజల్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు, అణచిపెట్టేందుకు సామ దాన భేద దండోపాయాలను అనుసరిస్తారు. ప్రజల అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని, నిస్సహాయతను ఆసరాగా చేసుకొని గజకర్ణ గోకర్ణ టక్కుటమార విద్యల్ని ప్రదర్శిస్తూ సాగినంత కాలం పాలన సాగిస్తారు. ఇప్పుడూ అదే చేస్తున్నారు. దోపిడీ, పీడనలకు మేలిముసుగులో తోడుగుతున్నారు. కులం, మతం, ప్రాంతం, నేటి పాలకులకు కలసివచ్చిన అంశాలయ్యాయి. దుర్మార్గమైన 'కేవల ఆర్ధిక సంబంధాల సంస్కృతి'ని జనం నెత్తిన రుద్దుతున్నారు. ప్రజల మనసుల్ని గెలుచుకోడానికి వారికి కావలసినంత బంధుజనం, సాంకేతిక నిపుణులగణం, అర్థబలం ఉంది. అదే వారి ధీమా. ఈ ధీమా ఎల్లకాలం చెల్లదు. ఇవేవీ వారికి శాశ్వత రక్షణ కవచాలు కావు. ప్రజలు చైతన్యవంతులయ్యేవరకే ఈ ఆటలన్నీ. ఈ జనంలోంచే వస్తారు పోరాటయోధులు - 'మృత్యుంజయులు'.© 2017,www.logili.com All Rights Reserved.