నేస్తం
నిరంతర అనంత చైతన్య ప్రభాతానికి ప్రణామాలు!
ప్రకృతి ఉదయరాగం మీటుతోంది! ప్రకృతితో మమేకమైయుండే చెట్టు, చేమ, అఖిల జీవకోటి చైతన్యవంతమవుతున్నాయి! ఇది నిరంతర చైతన్య చక్రం!
ప్రకృతి అద్భుతాల అనంతాల పుట్ట. భూమి, ఆకాశం, అడవులు, కొండలు కోనలు, హిమస్థాణువులు, జలపాతాలు ఎడారులు ప్రకృతిలో మమేకమయినవే!
- ప్రకృతి మనసుని రంజింపజేస్తుంది. ప్రకృతి విశ్లేషణలకు అంతుచిక్కని విస్తృత స్వభావం కలిగిన మహాచైతన్యం. ప్రకృతిని ఏ మంత్ర తంత్రము శాసించలేదు-
- ప్రకృతి స్వభావాన్ని ఏ ఇతిహాస గ్రంధాలు చెప్పలేవు! ప్రకృతిని ఎంతటి అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానమైన దిశను లేదా స్వభావాన్ని మార్చలేదు!
- ప్రకృతి కురుస్తున్న వర్షపు జల్లు నేలను తాకేలోపు గాలిలోనే వడగళ్లగా మార్చగలదు! -
వడగళ్ళును మొక్కలమీద, పాదులమీద మంచుపూలుగా పూయించగలదు! వసంతం వచ్చినట్లు భ్రమింపనూ జెయ్యగలదు! -
- ఇలా మనస్సుని మాయజేసే మహాచమత్కారి ప్రకృతి!-
- ప్రకృతిని తెలుసుకోవడం అనుసరించడం, ఇప్పటి వరకూ నాగరిక మానవ సమూహం చెయ్యలేదు.
ప్రకృతిలో ప్రశాంతత ఉంది. ప్రళయం ఉంది. 'ప్రకృతిమాత' అనే మాతృ సంబంధమైన బంధం ప్రకృతితో ముడిపడి ఉంది. ప్రకృతి అణువు అణువులో పరమ అద్భుతం. ప్రకృతికి మరో కోణం ఉప్పెనలు, ఉపద్రవాలు, ఎండిపోయే జీవనదులు, ఇలా మరెన్నో అంశాల కలయికే ప్రకృతి, పర్యావరణం. మొదటిది విశ్వాసానికి సంబంధించినది, రెండవది విజ్ఞాన శాస్త్ర జనితము! ఈ రెండూ సమతుల్యంగా ఉంటేనే ప్రాణికోటి మనగలుగుతుంది. మనిషితో సహా!
పర్యావరణం సమతుల్యం కోల్పోతే, గాలి, సముద్రాలతో కలిసి ఉప్పెనల
రూపంలో విజృంభిస్తుంది-
-పర్యావరణం సమతుల్యం కోల్పోయేది ఒక్క మానవ సమాజం తప్పిదాల వల్ల మాత్రమే! మానవ సమాజానికి ప్రకృతే జీవనాడి!-..............
నేస్తం నిరంతర అనంత చైతన్య ప్రభాతానికి ప్రణామాలు! ప్రకృతి ఉదయరాగం మీటుతోంది! ప్రకృతితో మమేకమైయుండే చెట్టు, చేమ, అఖిల జీవకోటి చైతన్యవంతమవుతున్నాయి! ఇది నిరంతర చైతన్య చక్రం! ప్రకృతి అద్భుతాల అనంతాల పుట్ట. భూమి, ఆకాశం, అడవులు, కొండలు కోనలు, హిమస్థాణువులు, జలపాతాలు ఎడారులు ప్రకృతిలో మమేకమయినవే! - ప్రకృతి మనసుని రంజింపజేస్తుంది. ప్రకృతి విశ్లేషణలకు అంతుచిక్కని విస్తృత స్వభావం కలిగిన మహాచైతన్యం. ప్రకృతిని ఏ మంత్ర తంత్రము శాసించలేదు- - ప్రకృతి స్వభావాన్ని ఏ ఇతిహాస గ్రంధాలు చెప్పలేవు! ప్రకృతిని ఎంతటి అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానమైన దిశను లేదా స్వభావాన్ని మార్చలేదు! - ప్రకృతి కురుస్తున్న వర్షపు జల్లు నేలను తాకేలోపు గాలిలోనే వడగళ్లగా మార్చగలదు! - వడగళ్ళును మొక్కలమీద, పాదులమీద మంచుపూలుగా పూయించగలదు! వసంతం వచ్చినట్లు భ్రమింపనూ జెయ్యగలదు! - - ఇలా మనస్సుని మాయజేసే మహాచమత్కారి ప్రకృతి!- - ప్రకృతిని తెలుసుకోవడం అనుసరించడం, ఇప్పటి వరకూ నాగరిక మానవ సమూహం చెయ్యలేదు. ప్రకృతిలో ప్రశాంతత ఉంది. ప్రళయం ఉంది. 'ప్రకృతిమాత' అనే మాతృ సంబంధమైన బంధం ప్రకృతితో ముడిపడి ఉంది. ప్రకృతి అణువు అణువులో పరమ అద్భుతం. ప్రకృతికి మరో కోణం ఉప్పెనలు, ఉపద్రవాలు, ఎండిపోయే జీవనదులు, ఇలా మరెన్నో అంశాల కలయికే ప్రకృతి, పర్యావరణం. మొదటిది విశ్వాసానికి సంబంధించినది, రెండవది విజ్ఞాన శాస్త్ర జనితము! ఈ రెండూ సమతుల్యంగా ఉంటేనే ప్రాణికోటి మనగలుగుతుంది. మనిషితో సహా! పర్యావరణం సమతుల్యం కోల్పోతే, గాలి, సముద్రాలతో కలిసి ఉప్పెనల రూపంలో విజృంభిస్తుంది- -పర్యావరణం సమతుల్యం కోల్పోయేది ఒక్క మానవ సమాజం తప్పిదాల వల్ల మాత్రమే! మానవ సమాజానికి ప్రకృతే జీవనాడి!-..............© 2017,www.logili.com All Rights Reserved.