లలిత శోభితం... సందేశభరితం
ఈ ఆగస్టు పదైదుకు మనకు స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా ఆశలు, ఆకాంక్షలు, అచీవ్మెంట్స్, ఫెయిల్యూర్స్ గురించి చాలా చర్చించాం. ఈ ఏడున్నర దశాబ్దాల్లో మన కష్టసుఖాలకు సంబంధం లేకుండా మన దేశవాసులందరి తోడుగా సాగిన అంశాలలో ముఖ్యమైన పది ఏమిటి? 'ఇండియా అట్ 75' అనే పేరుతో ఢిల్లీ నుంచి వెలువడే 'ది హిందూ స్తాన్ టైమ్స్' సంస్థ వారి ఆర్థిక విషయాల దినపత్రిక 'మింట్' ఒక పేజీ వ్యాసాన్ని 2022 ఆగస్టు 15న ప్రచురించింది. ఇది ఆ పత్రిక పరిశోధనగా పది బాక్స్ ఐటమ్స్ ఇచ్చారు. ఆ పది ఏమిటో తెలుసా? ట్రాన్సిస్టర్ రేడియో, ఐ.ఆర్. 8 బియ్యం , హెచ్ ఎంటి గడియారం, బజాజ్ చేతక్, మ్యాగీ నూడుల్స్, క్రికెట్ (టెన్నిస్ బాల్), క్యాసెట్ ఆడియో టేప్, కోకో కోలా డ్రింక్, స్మార్ట్ ఫోన్, కోవిడ్ రింగ్ లైట్ - అంటూ ఆ జాబితా ఇచ్చారు? మీరు జాగ్రత్తగా ఈ పదింటిని చూస్తే ఎంత విస్తృతంగా అవి వ్యాపించి ఉన్నాయో బోధపడుతుంది!
నేను ఆకాశవాణిలో పనిచేశాను కనుక రేడియో 1950ల నుంచి మూడున్నర దశాబ్దాలకు పైగా రేడియో ఎలా వ్యాపించి ఉందో తెలుసు. తర్వాతి విషయమే ఆసక్తి కలిగించింది, కాదు గర్వకారణమైంది.
పార్లమెంటులో ప్రతియేటా బడ్జెట్ ప్రవేశపెడుతూ ఆర్థిక మంత్రి ఎన్ని విషయాలు తర్వాత వివరించినా, ప్రసంగం మొదట్లో రాబోయే సంవత్సరంలో వర్షపాతం గురించి ప్రస్తావించి, పిమ్మట పంటల దిగుబడి సంబంధిం చిన వివరాలు, తర్వాత బడ్జెట్ విశ్లేషణ కొనసాగుతుంది..........
© 2017,www.logili.com All Rights Reserved.