చరిత్రను ఒక మంచి కథగానో, ఒక బలమైన నవలగానో చిత్రించటం చాలా కష్టం. ఇక నడుస్తున్న చరిత్రను నవలగా నిర్మించడం అంటే నిస్సందేహంగా అది కత్తిమీద సామే..! నల్లూరి రుక్మిణి రచన 'నిషిధ' నవలా నిర్మాణం ముమ్మాటికీ అసలైన అర్థంలో ఒక అసిధారావ్రతం. సాధారణంగా మనం చదివే అత్యధికశాతం చరిత్ర పుస్తకాల్లో పేర్లు, తేదీలు మాత్రమే వాస్తవాలు, మిగతావి ముప్పాతిక మువ్వీనం కట్టుకథలు, పుక్కిటి పురాణాలు, అభూత కల్పనలు, మహా అయితే అర్థసత్యాలు.
'నిషిద' లో కేవలం పేర్లు, తేదీలు మాత్రమే అవాస్తవాలు, మిగతావన్నీ పచ్చినిజాలు. ఈ నవలలో ఊరిపేరు, వ్యక్తుల పేర్లు మార్చి రాసినప్పటికీ పాఠకుడికి అసలు పేర్లు అవలీలగా తెలిసిపోతాయి. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం గుంటూరు జిల్లా, తెనాలి పట్టణానికి అల్లంత దూరంలో ఉన్న గ్రామంలో అగ్రకులాలు అత్యంత అమానుషమయిన రీతిలో దళితులపై జరిపిన దారుణ మారణకాండకు అక్షరరూపం 'నిషిధ'. ఇది కేవలం ఈ నవలకు ఇతివృత్తం మాత్రమే. పరిధికాదు. 'నిషిద' విషయపరిధి, భారతదేశంలో పీడితులైన దస్యులు, దళితులూ, బహుజనుల చరిత్ర ఎంత ప్రాచీనమయినదో, ఎంత సుదీర్ఘమయినదో అంత ప్రాచీనమయినదీ, సుదీర్ఘమైనదీ.
చరిత్రను ఒక మంచి కథగానో, ఒక బలమైన నవలగానో చిత్రించటం చాలా కష్టం. ఇక నడుస్తున్న చరిత్రను నవలగా నిర్మించడం అంటే నిస్సందేహంగా అది కత్తిమీద సామే..! నల్లూరి రుక్మిణి రచన 'నిషిధ' నవలా నిర్మాణం ముమ్మాటికీ అసలైన అర్థంలో ఒక అసిధారావ్రతం. సాధారణంగా మనం చదివే అత్యధికశాతం చరిత్ర పుస్తకాల్లో పేర్లు, తేదీలు మాత్రమే వాస్తవాలు, మిగతావి ముప్పాతిక మువ్వీనం కట్టుకథలు, పుక్కిటి పురాణాలు, అభూత కల్పనలు, మహా అయితే అర్థసత్యాలు. 'నిషిద' లో కేవలం పేర్లు, తేదీలు మాత్రమే అవాస్తవాలు, మిగతావన్నీ పచ్చినిజాలు. ఈ నవలలో ఊరిపేరు, వ్యక్తుల పేర్లు మార్చి రాసినప్పటికీ పాఠకుడికి అసలు పేర్లు అవలీలగా తెలిసిపోతాయి. దాదాపు రెండున్నర దశాబ్దాల క్రితం గుంటూరు జిల్లా, తెనాలి పట్టణానికి అల్లంత దూరంలో ఉన్న గ్రామంలో అగ్రకులాలు అత్యంత అమానుషమయిన రీతిలో దళితులపై జరిపిన దారుణ మారణకాండకు అక్షరరూపం 'నిషిధ'. ఇది కేవలం ఈ నవలకు ఇతివృత్తం మాత్రమే. పరిధికాదు. 'నిషిద' విషయపరిధి, భారతదేశంలో పీడితులైన దస్యులు, దళితులూ, బహుజనుల చరిత్ర ఎంత ప్రాచీనమయినదో, ఎంత సుదీర్ఘమయినదో అంత ప్రాచీనమయినదీ, సుదీర్ఘమైనదీ.© 2017,www.logili.com All Rights Reserved.