గ్రీష్మ ఋతువు: సుజాత చంటిపిల్ల, తండ్రి నిస్వార్థజీవి. లోకం విసిరిన స్వార్ధ గ్రీష్మ తాపానికి ఓడిపోయాడు. తమ దగ్గరున్న విధవ మేనత్త చల్లగా తన కొడుకుతో పెదనాన్న దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ పెదనాన్న స్వార్ధానికి పెద్ద!
వర్ష ఋతువు: సుజాత పెరిగి పెద్దదయ్యింది. సమాజపు వానకి, పిడుగుపాటుకి ఆ ఇల్లు నిలువలేకపోయింది. తల్లితండ్రుల్ని పట్టణానికి తీసుకువెళ్లి సుజాత ఉద్యోగంలో చేరింది.
శరదృతువు: సుజాత ప్రతిభని పసిగట్టిన మేనబావ పెళ్ళాడతానంటే సుజాత కాదుపొమ్మంది. ఆమె ప్రతిభను గుర్తించి ఐ ఎ ఎస్ కృష్ణ సుజాతకి చంద్రుడిగా అవ్వాలనుకున్నారు. ముందరే ఆ కుటుంబానికి వెన్నెల కురిపించేడు.
హేమంత ఋతువు: సుజాత తల్లి మంచులా మంచాన పడింది. ఆ చల్లని తల్లిని ఆదుకోవడానికి కృష్ణుడు వచ్చేడు. కృష్ణుడి వేడి సుజాత మనసు మొగ్గలు తోడేసింది.
శిశిర ఋతువు: కృష్ణుని మీద పెంచుకున్న అనురాగలత లేత ఆకుల్ని తురిమేందుకు ఎవరికీ అధికారం లేదనుకున్న సుజాత ఆంతరంగికంగా అతనిపై ప్రేమలతను పెంచుకుంది.
వసంత ఋతువు: జీవితంలో వసంతం కోసం ఎందరో అర్రులు చాచి సిద్ధంగా ఉంటారు. అలాంటప్పుడు కృష్ణుడు నేనున్నానన్నాడు. కానీ, అతను కులం తక్కువ మనిషి.
అసలీ కృష్ణుడెవరు? సుజాత కుటుంబం కృష్ణుడి సాయంతో వసంత రుతువులోనే ఆగిఉందా? లేక, మరలా గ్రీష్మతాపానికీ, గొప్ప ప్రభంజనానికి గురై పతనమైందా..?
గ్రీష్మ ఋతువు: సుజాత చంటిపిల్ల, తండ్రి నిస్వార్థజీవి. లోకం విసిరిన స్వార్ధ గ్రీష్మ తాపానికి ఓడిపోయాడు. తమ దగ్గరున్న విధవ మేనత్త చల్లగా తన కొడుకుతో పెదనాన్న దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ పెదనాన్న స్వార్ధానికి పెద్ద! వర్ష ఋతువు: సుజాత పెరిగి పెద్దదయ్యింది. సమాజపు వానకి, పిడుగుపాటుకి ఆ ఇల్లు నిలువలేకపోయింది. తల్లితండ్రుల్ని పట్టణానికి తీసుకువెళ్లి సుజాత ఉద్యోగంలో చేరింది. శరదృతువు: సుజాత ప్రతిభని పసిగట్టిన మేనబావ పెళ్ళాడతానంటే సుజాత కాదుపొమ్మంది. ఆమె ప్రతిభను గుర్తించి ఐ ఎ ఎస్ కృష్ణ సుజాతకి చంద్రుడిగా అవ్వాలనుకున్నారు. ముందరే ఆ కుటుంబానికి వెన్నెల కురిపించేడు. హేమంత ఋతువు: సుజాత తల్లి మంచులా మంచాన పడింది. ఆ చల్లని తల్లిని ఆదుకోవడానికి కృష్ణుడు వచ్చేడు. కృష్ణుడి వేడి సుజాత మనసు మొగ్గలు తోడేసింది. శిశిర ఋతువు: కృష్ణుని మీద పెంచుకున్న అనురాగలత లేత ఆకుల్ని తురిమేందుకు ఎవరికీ అధికారం లేదనుకున్న సుజాత ఆంతరంగికంగా అతనిపై ప్రేమలతను పెంచుకుంది. వసంత ఋతువు: జీవితంలో వసంతం కోసం ఎందరో అర్రులు చాచి సిద్ధంగా ఉంటారు. అలాంటప్పుడు కృష్ణుడు నేనున్నానన్నాడు. కానీ, అతను కులం తక్కువ మనిషి. అసలీ కృష్ణుడెవరు? సుజాత కుటుంబం కృష్ణుడి సాయంతో వసంత రుతువులోనే ఆగిఉందా? లేక, మరలా గ్రీష్మతాపానికీ, గొప్ప ప్రభంజనానికి గురై పతనమైందా..?© 2017,www.logili.com All Rights Reserved.