తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపజేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు. ప్రేమలు, పెళ్ళిళ్ళకంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కథారచయిత్రి అవార్డులు పొందారు.
తిరిగి ఇన్నాళ్ళకు మాదిరెడ్డి సులోచన నవలలు మీ ముందుకు వచ్చాయి. దాదాపు నలభై ఏళ్ళ క్రితం, అచ్చమైన తెలంగాణా వాతావరణం, పొందికైన మానవ సంబంధాలూ కలగలిపి చక్కని ఇతివృత్తాలు ఆమె సాహిత్యంలో కనిపిస్తాయి.
ఇప్పుడు అంటే నూతన సహస్రాబ్ది తొలిదశక౦లో ఈ నవలల్ని చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో పాఠకులకు అసహజంగా ఉన్న భావన కలిగే అవకాశ౦ ఉంది. ఎందుకంటే గడిచిన నలభై సంవత్సరాలలో ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక రంగాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆనాటి రూపాయికి పొంతన లేదు. కొన్ని వూళ్ళ పేర్లు, కొన్ని మాటల అర్థాలు సైతం మారిపోయాయి. వేషధారణ మారింది. దూరాలు తగ్గిపోయాయి. భూగోళం గుప్పెట్లో వొదిగిపోయింది. ఆనాడు వంద రూపాయలంటే చాలా పెద్ద మొత్తం. నేడు అది చిల్లర డబ్బు. కనుక ఇలాంటివి మాదిరెడ్డి నవలలలో తారసపడినప్పుడు విజ్ఞులైన మా పాఠకులు కాలంతో అన్వయించుకుని అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాము. ఆచార వ్యవహారాలలో, మాటతీరులో ఉన్నట్టుండి ఎన్నో మార్పులు వచ్చాయి.
ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు ఎన్ని తరాలు గడిచినా చలనం ఉండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే ఉంటాయి. మా సంస్థ 50 సంవత్సరాలలోకి అడుగుపెట్టిన తరుణంలో ఉత్తమ విలువలను ప్రోది చేసిన మాదిరెడ్డి నవలలను పునర్ముద్రించడం మాకెంతో ఆనందంగా ఉంది. వీటిని తెలుగు పాఠకులు సొంతం చేసుకుని , చదివి ఆనందిస్తారని మా ఆకాంక్ష.
తెలుగునాట నవలల్ని విశేషంగా చదివింపజేసే అలవాటు చేసిన రచయితల్లో మాదిరెడ్డి సులోచన ఒకరు. ఆనాడు కాల్పనిక ప్రభావంతో రచనలు చేసిన వారిలో ఈమె ఒకరు. ఊహాజనిత చిత్రణ కంటే వాస్తవిక జీవిత చిత్రణకు ప్రయత్నించారు. ప్రేమలు, పెళ్ళిళ్ళకంటే కుటుంబ జీవితానికి ప్రాధాన్యం ఇచ్చారు. ఉత్తమ ఉపాధ్యాయిని, ఉత్తమ కథారచయిత్రి అవార్డులు పొందారు. తిరిగి ఇన్నాళ్ళకు మాదిరెడ్డి సులోచన నవలలు మీ ముందుకు వచ్చాయి. దాదాపు నలభై ఏళ్ళ క్రితం, అచ్చమైన తెలంగాణా వాతావరణం, పొందికైన మానవ సంబంధాలూ కలగలిపి చక్కని ఇతివృత్తాలు ఆమె సాహిత్యంలో కనిపిస్తాయి. ఇప్పుడు అంటే నూతన సహస్రాబ్ది తొలిదశక౦లో ఈ నవలల్ని చదువుతున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాలలో పాఠకులకు అసహజంగా ఉన్న భావన కలిగే అవకాశ౦ ఉంది. ఎందుకంటే గడిచిన నలభై సంవత్సరాలలో ఆర్ధిక, సాంఘిక, సాంస్కృతిక రంగాలలో గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆనాటి రూపాయికి పొంతన లేదు. కొన్ని వూళ్ళ పేర్లు, కొన్ని మాటల అర్థాలు సైతం మారిపోయాయి. వేషధారణ మారింది. దూరాలు తగ్గిపోయాయి. భూగోళం గుప్పెట్లో వొదిగిపోయింది. ఆనాడు వంద రూపాయలంటే చాలా పెద్ద మొత్తం. నేడు అది చిల్లర డబ్బు. కనుక ఇలాంటివి మాదిరెడ్డి నవలలలో తారసపడినప్పుడు విజ్ఞులైన మా పాఠకులు కాలంతో అన్వయించుకుని అర్థం చేసుకోగలరని ఆశిస్తున్నాము. ఆచార వ్యవహారాలలో, మాటతీరులో ఉన్నట్టుండి ఎన్నో మార్పులు వచ్చాయి. ఎన్ని మార్పులు వచ్చినా మానవనైజాలు, ప్రవృత్తులు ఎన్నటికీ మారవు. ప్రేమ, ద్వేషం, స్వార్థం లాంటి ముడి దినుసుకు ఎన్ని తరాలు గడిచినా చలనం ఉండదు. అందుకే మాదిరెడ్డి సులోచన కాల్పనిక సాహిత్యంలో మౌలిక అంశాలు నేటికీ నూతనంగానే ఉంటాయి. మా సంస్థ 50 సంవత్సరాలలోకి అడుగుపెట్టిన తరుణంలో ఉత్తమ విలువలను ప్రోది చేసిన మాదిరెడ్డి నవలలను పునర్ముద్రించడం మాకెంతో ఆనందంగా ఉంది. వీటిని తెలుగు పాఠకులు సొంతం చేసుకుని , చదివి ఆనందిస్తారని మా ఆకాంక్ష.
© 2017,www.logili.com All Rights Reserved.