టిప్పు సుల్తాన్
భారతదేశ చరిత్రలో -
18వ శతాబ్దపు మధ్యకాలమది.
ఓ అపూర్వ చరిత్రను సృష్టించిన వ్యక్తి ఉద్భవించడానికి దోహదం చేసిన రోజులవి ! ఆ రోజుల్లో ఒక రోజు ఉదయాన
మైసూరు రాజ్యపు పరిధిలోని దేవనహళ్ళి రాచవీధిలో....
ప్రపంచాన్ని జయించిన వీరుడిలా, ఎంతో ఆత్మ విశ్వాసంతో తన అరబ్బీ గుర్రం మీద స్వారి చేస్తున్నాడు ఓ పాతికేళ్ళ యువకుడు. అతని ముఖంలో రాజసం ఉట్టిపడుతూ వుంది. విశాల బాహువులతో పొందికైన శరీరాకృతితో కొనదేరిన చుబుకంతో స్ఫురద్రూపి అయిన ఆ యువకుడు ముందుకు సాగిపోతున్నాడు.
అతని కళ్ళు సరిసరాలను గమనిస్తుంటే, ఓ ఇంటి మేడమీది నుండి అతన్నే ఓ వన్నెల చిన్నారి తదేకంగా చూస్తూ వుంది. చూడటంతో తృప్తిపడక అతని గురించి వివరాలు తెలుసుకోవాలని ఉబలాట పడింది.
"ఎవరే అతడు ?" ప్రశ్నించింది ఆ యువతి తన దాసి నసీమన్ను.
ఆ చూపులకు, ఆ ప్రశ్నకు అర్ధం ఏమిటో ఊహించిన నసీమ్ తన యజమాని కూతురు ఫకురున్నీసా తొలి చూపులోనే ఆ యువకుని పట్ల ఆకర్షితురాలయ్యిందని సులభంగా గ్రహించ గల్గింది.
"పేరు హెదర్ అలీ. ప్రస్తుతం మన దేవనహళ్ళి కోటలోని సైన్యంలో నాయక్గా పని చేస్తున్నాడు" అంది నసీమ్.
"ఈ వయస్సులోనే నాయక్ కాగలిగాడా!" ఆశ్చర్యంగా అంది ఫకురున్నీసా.
"ఇటీవల మన దేవనహళ్ళి పాలెగాడు మైసూరు రాజ్యానికి కప్పం కట్టకుండా తిరుగుబాటు చేసినందువల్ల మైసూరు రాజ్యపు దళవాయి నంజ రాజా స్వయంగా సైన్యంతో దాడి చేసి మన పాలెగాడిని ఓడించి కోట స్వాధీనం చేసుకొన్న విషయం మీకు తెలుసు కదా! ఆ దాడిలో ఇతడు కేవలం ఒక సామాన్య సైనికుడిగా పాల్గొని తన శౌర్యప్రతాపాలతో ధైర్య సాహసాలతో శత్రు సైనికులను అంతమొందించడంవల్ల ఇతనికి వెంటనే 'నాయక్' పదవి లభించింది. ఇతడు ఎవరో కాదు, మన వీధి చివరన వున్న నా బాజ్ ఖాన్ తమ్ముడు. షహబాజ్ ఖాన్ మీ అబ్బాజాన్కు బాగా తెలుసు............
టిప్పు సుల్తాన్భారతదేశ చరిత్రలో -18వ శతాబ్దపు మధ్యకాలమది. ఓ అపూర్వ చరిత్రను సృష్టించిన వ్యక్తి ఉద్భవించడానికి దోహదం చేసిన రోజులవి ! ఆ రోజుల్లో ఒక రోజు ఉదయాన మైసూరు రాజ్యపు పరిధిలోని దేవనహళ్ళి రాచవీధిలో.... ప్రపంచాన్ని జయించిన వీరుడిలా, ఎంతో ఆత్మ విశ్వాసంతో తన అరబ్బీ గుర్రం మీద స్వారి చేస్తున్నాడు ఓ పాతికేళ్ళ యువకుడు. అతని ముఖంలో రాజసం ఉట్టిపడుతూ వుంది. విశాల బాహువులతో పొందికైన శరీరాకృతితో కొనదేరిన చుబుకంతో స్ఫురద్రూపి అయిన ఆ యువకుడు ముందుకు సాగిపోతున్నాడు. అతని కళ్ళు సరిసరాలను గమనిస్తుంటే, ఓ ఇంటి మేడమీది నుండి అతన్నే ఓ వన్నెల చిన్నారి తదేకంగా చూస్తూ వుంది. చూడటంతో తృప్తిపడక అతని గురించి వివరాలు తెలుసుకోవాలని ఉబలాట పడింది. "ఎవరే అతడు ?" ప్రశ్నించింది ఆ యువతి తన దాసి నసీమన్ను. ఆ చూపులకు, ఆ ప్రశ్నకు అర్ధం ఏమిటో ఊహించిన నసీమ్ తన యజమాని కూతురు ఫకురున్నీసా తొలి చూపులోనే ఆ యువకుని పట్ల ఆకర్షితురాలయ్యిందని సులభంగా గ్రహించ గల్గింది. "పేరు హెదర్ అలీ. ప్రస్తుతం మన దేవనహళ్ళి కోటలోని సైన్యంలో నాయక్గా పని చేస్తున్నాడు" అంది నసీమ్. "ఈ వయస్సులోనే నాయక్ కాగలిగాడా!" ఆశ్చర్యంగా అంది ఫకురున్నీసా. "ఇటీవల మన దేవనహళ్ళి పాలెగాడు మైసూరు రాజ్యానికి కప్పం కట్టకుండా తిరుగుబాటు చేసినందువల్ల మైసూరు రాజ్యపు దళవాయి నంజ రాజా స్వయంగా సైన్యంతో దాడి చేసి మన పాలెగాడిని ఓడించి కోట స్వాధీనం చేసుకొన్న విషయం మీకు తెలుసు కదా! ఆ దాడిలో ఇతడు కేవలం ఒక సామాన్య సైనికుడిగా పాల్గొని తన శౌర్యప్రతాపాలతో ధైర్య సాహసాలతో శత్రు సైనికులను అంతమొందించడంవల్ల ఇతనికి వెంటనే 'నాయక్' పదవి లభించింది. ఇతడు ఎవరో కాదు, మన వీధి చివరన వున్న నా బాజ్ ఖాన్ తమ్ముడు. షహబాజ్ ఖాన్ మీ అబ్బాజాన్కు బాగా తెలుసు............© 2017,www.logili.com All Rights Reserved.