మరో శ్రీనాధుడు
తెలుగు సాహిత్యానికి సంబంధించి శ్రీనాధుని గురించి తెలియని వారెవరూ వుండరు.
అలాగే వుర్దూ, పారశీక సాహిత్యానికి సంబంధించి 'గాలిబ్' గురించి తెలియని వారుండరు. వీరిద్దరికీ చాలా విషయాల్లో సామీప్యం వుంది. గాలిబ్ కూడా శ్రీనాధుని లాంటి జీవితాన్ని గడిపాడు. చరమ దశలో శ్రీనాధునిలాగే ఆర్థిక సమస్యల మధ్య తనువు చాలించాడు. శ్రీనాధునికి మల్లే గాలిబ్ వ్యక్తిత్వం కూడా విలక్షణమైనది! అందుకు ఉదాహరణగా...
ఢిల్లీ నగరంలో.....
ఎర్రకోట సమీపాన...
తన ఇంటి ముందున్న బయలు ప్రదేశంలో... పున్నమివేళ....
వాలుకుర్చీలో కూర్చుండిపోయి ఆకాశంలోని తారల వంక తదేకంగా చూస్తుండిపోయాడు గాలిబ్. ఆ సమయాన... అతనిలో ఏదో తెలియని తన్మయత్వం! ప్రకృతి రేపే పులకరింత వల్ల ఎదలోతుల్లో పొంగారుతోన్న భావావేశం! ఆ భావావేశం ఒక్కో రుబాయిగా రూపొందుతూ అతని మస్తిష్కంలో నిక్షిప్తమవుతూవుంది. నిక్షిప్తమయిన ఆ రూపాలకు గుర్తుగా అతని చేతుల్లో వున్న పైజామా తాలుకు పొడుగాటి నాడా ఒక్కొ ముడిని సంతరించుకుంది. మరునాటి ఉదయం.....
ఒక్కొ ముడిని విప్పుకుంటూ తన కలంతో అక్షరరూపం ఇవ్వడంలో నిమగ్నమయ్యాడు గాలిబ్. మొదటి ముడి తాలుకు రుబాయి.
చారిత్రక గాధలు
ఎస్.డి.వి. అజీజ్
మరో శ్రీనాధుడు తెలుగు సాహిత్యానికి సంబంధించి శ్రీనాధుని గురించి తెలియని వారెవరూ వుండరు. అలాగే వుర్దూ, పారశీక సాహిత్యానికి సంబంధించి 'గాలిబ్' గురించి తెలియని వారుండరు. వీరిద్దరికీ చాలా విషయాల్లో సామీప్యం వుంది. గాలిబ్ కూడా శ్రీనాధుని లాంటి జీవితాన్ని గడిపాడు. చరమ దశలో శ్రీనాధునిలాగే ఆర్థిక సమస్యల మధ్య తనువు చాలించాడు. శ్రీనాధునికి మల్లే గాలిబ్ వ్యక్తిత్వం కూడా విలక్షణమైనది! అందుకు ఉదాహరణగా... ఢిల్లీ నగరంలో..... ఎర్రకోట సమీపాన... తన ఇంటి ముందున్న బయలు ప్రదేశంలో... పున్నమివేళ.... వాలుకుర్చీలో కూర్చుండిపోయి ఆకాశంలోని తారల వంక తదేకంగా చూస్తుండిపోయాడు గాలిబ్. ఆ సమయాన... అతనిలో ఏదో తెలియని తన్మయత్వం! ప్రకృతి రేపే పులకరింత వల్ల ఎదలోతుల్లో పొంగారుతోన్న భావావేశం! ఆ భావావేశం ఒక్కో రుబాయిగా రూపొందుతూ అతని మస్తిష్కంలో నిక్షిప్తమవుతూవుంది. నిక్షిప్తమయిన ఆ రూపాలకు గుర్తుగా అతని చేతుల్లో వున్న పైజామా తాలుకు పొడుగాటి నాడా ఒక్కొ ముడిని సంతరించుకుంది. మరునాటి ఉదయం..... ఒక్కొ ముడిని విప్పుకుంటూ తన కలంతో అక్షరరూపం ఇవ్వడంలో నిమగ్నమయ్యాడు గాలిబ్. మొదటి ముడి తాలుకు రుబాయి. “దర్దేదిల్ లిఖూ కబ్ తక్ జావూ ఉన్కూ దిఖాదూ. ఉంగ్లియా ఫిగార్ అప్నీ భామయె ఖాచుకా... అప్నా” చారిత్రక గాధలు ఎస్.డి.వి. అజీజ్© 2017,www.logili.com All Rights Reserved.