విద్యా సుందరి బెంగుళూరు నాగరత్నమ్మ గారి జీవితకథని నవలగా రాయటమంటే సమాజంలోని రెండు ప్రధాన వివక్షలను అర్థం చేసుకుని చారిత్రకంగా ఆ వ్యవస్థల్లో వచ్చిన మార్పులనూ, ఆ మార్పులు సంభవిస్తున్న కాలంలో వ్యక్తుల జీవితాలలో చోటుచేసుకున్న సంక్షుభిత సందర్భాలనూ పాఠకులకు పరిచయం చేయటం. ఆ క్లిష్టమైన పనిని తలపెట్టి "త్యాగరత్న" నవలను మనకందించారు ప్రొఫెసర్ మెలెయూరు గురుస్వామిగారు. కన్నడ భాషలోని ఈ ఉన్నత సాహిత్యకృషిని తెలుగు పాఠకులకు అందించటానికి శ్రమించారు రచయితగా, అనువాదకులుగా తెలుగు సాహిత్యలోకానికి సుపరిచితులైన రంగనాథ రామచంద్రరావుగారు.
ఒకానొక సంధికాలంలో, సామజిక అణచివేత మూలాలుగా ఉన్న జండర్, కులం అనే సాంఘిక వ్యవస్థలతో తలపడి, సంఘర్షించి, మానవీయ విలువలున్న వ్యక్తిగా, గొప్ప సంగీత, నృత్యకళాకారిణిగా, కళారాధకురాలిగా రాణించి చరిత్రలో నిలిచిపోవటం సామాన్యమైన విషయం కాదు. నాగరత్నమ్మ సామాన్యమైన వ్యక్తి కాదు. ఆమె పుట్టింది సామాన్య నేపథ్యంలోనే. ఆ కులం తన ప్రాభవాన్ని కోల్పోతున్న కాలంలో జన్మించి, తన జీవితకాలంలో సంభవించిన, సంఘర్షించిన సామాజిక వైరుధ్యాల నడుమ జీవించి చరిత్ర సృష్టించింది నాగరత్నమ్మ. చరిత్ర నిర్మాతలలో ఒకరిగా మిగిలిపోయింది
- ఆచార్య మెలెయూరు గురుస్వామి, రంగనాథ రామచంద్రరావు