సాంప్రదాయక వీరగాథలను - ముఖ్యంగా జంగంకథలను - అనుకరిస్తూ రెండవ ప్రపంచ యుద్ధకాలంలో (1942 ప్రాంతంలో) గుంటూరు జిల్లానుంది. బుఱ్ఱకథలు వ్యాప్తిలోకి వచ్చాయి. కమ్యూనిస్టులు తమ రాజకీయ సిద్ధాంత ప్రచారం కోసం, ప్రధానంగా జంగంకథలను అనుకరిస్తూ వీటిని సృష్టించారు. ప్రాచీన కాలంలోని యక్షగానాలే బుఱ్ఱకథలుగా పరిణమించాయని ప్రముఖ బుఱ్ఱకథా గాయకులైన షేక్ నాజర్ గారి అభిప్రాయం. అయితే, నా పరిశీలనలో యక్షగాన రచనకూ - జంగంకథారచనకూ ఏమీ తేడా కనిపించలేదు. రచనా స్వరూపంలో రెండూ ఒకటే. కాబట్టి నాగర్ గారి వాదనా - నా వాదనా ఒకటే అవుతుంది. -
తంత్రి + బుజ్జ = తంబుఱ. తంబుఱతో చెప్పే కథలు కాబట్టి 'తంబుఱకథలు". (పూర్వం ఈ పేరే ప్రచారంలో ఉండేది.) ఈ సమాసంలోని 'తం' లోపించి, శకటరేఫకు పూర్వపు ద్విత్వం వచ్చి, “బుఱ్ఱకథలు” అనే పేరు ఏర్పడి ఉంటుంది. లేదా గుమ్మెటలకు గుంటూరు జిల్లాలో “బ్బులు” అనే వ్యవహారం ఉందట. బ్బులు వాయిస్తూ చెప్పే కథలు కాబట్టి “బుఱ్ఱకథలు” అనే పేరు వచ్చి ఉంటుంది. నాజరుగారు తన “పల్నాటి యుద్ధం” - “బొబ్బిలి యుద్ధం” బుఱ్ఱకథలను కథాప్రారంభంలో "తంబుఱకథలు” అనే పేర్కొన్నారు. - “జోడుగుమ్మెటలు తాధిమియనగ /తోడుగ వంతలు జోరుగ పాడగ | రాగతాళ గీతాది నృత్యముల/ తంబుఱకథ వినుడీ!” (పల్నాటి యుద్ధం). “రాగతాళ సత్యాదుల మరగన్/ తంబుఱ కథగానంబు చేసెదన్” (బొబ్బిలియుద్ధం).
సాంప్రదాయక వీరగాథలను - ముఖ్యంగా జంగంకథలను - అనుకరిస్తూ రెండవ ప్రపంచ యుద్ధకాలంలో (1942 ప్రాంతంలో) గుంటూరు జిల్లానుంది. బుఱ్ఱకథలు వ్యాప్తిలోకి వచ్చాయి. కమ్యూనిస్టులు తమ రాజకీయ సిద్ధాంత ప్రచారం కోసం, ప్రధానంగా జంగంకథలను అనుకరిస్తూ వీటిని సృష్టించారు. ప్రాచీన కాలంలోని యక్షగానాలే బుఱ్ఱకథలుగా పరిణమించాయని ప్రముఖ బుఱ్ఱకథా గాయకులైన షేక్ నాజర్ గారి అభిప్రాయం. అయితే, నా పరిశీలనలో యక్షగాన రచనకూ - జంగంకథారచనకూ ఏమీ తేడా కనిపించలేదు. రచనా స్వరూపంలో రెండూ ఒకటే. కాబట్టి నాగర్ గారి వాదనా - నా వాదనా ఒకటే అవుతుంది. - తంత్రి + బుజ్జ = తంబుఱ. తంబుఱతో చెప్పే కథలు కాబట్టి 'తంబుఱకథలు". (పూర్వం ఈ పేరే ప్రచారంలో ఉండేది.) ఈ సమాసంలోని 'తం' లోపించి, శకటరేఫకు పూర్వపు ద్విత్వం వచ్చి, “బుఱ్ఱకథలు” అనే పేరు ఏర్పడి ఉంటుంది. లేదా గుమ్మెటలకు గుంటూరు జిల్లాలో “బ్బులు” అనే వ్యవహారం ఉందట. బ్బులు వాయిస్తూ చెప్పే కథలు కాబట్టి “బుఱ్ఱకథలు” అనే పేరు వచ్చి ఉంటుంది. నాజరుగారు తన “పల్నాటి యుద్ధం” - “బొబ్బిలి యుద్ధం” బుఱ్ఱకథలను కథాప్రారంభంలో "తంబుఱకథలు” అనే పేర్కొన్నారు. - “జోడుగుమ్మెటలు తాధిమియనగ /తోడుగ వంతలు జోరుగ పాడగ | రాగతాళ గీతాది నృత్యముల/ తంబుఱకథ వినుడీ!” (పల్నాటి యుద్ధం). “రాగతాళ సత్యాదుల మరగన్/ తంబుఱ కథగానంబు చేసెదన్” (బొబ్బిలియుద్ధం).
© 2017,www.logili.com All Rights Reserved.