ఈ నవల కథనం కూచిపూడి నృత్యంలా మృదుమధురంగా సాగిపోతూ ఉంటుంది. ఓ నృత్యకళాకారిణి జీవితానికి 'అద్దం' పట్టిన అపురూప రచన ఈ 'వేదిక'. మొదలు పెట్టడం వరకే పాఠకుల పని. ఆ తరువాత చూపులు అక్షరాల మీద శరవేగంతో పరుగుతీస్తుంటే, మనోచక్షువులు మనకు 'దృశ్యాన్ని' వెండితెర మీద సినిమాలా చూపుతాయి. ఆ వెండితెర కూడా మనస్సే. ప్రేమ, స్వార్థం, త్యాగం, అభిమానం, అంతస్తుల తేడా, కుటుంబ సభ్యుల మీద ఉండే సహజమైన ప్రేమాభిమానాలు, యువతీయువకుల ఆశలూ ఆకాంక్షలూ...నేటి పోకడలూ, నాటి ఆచార్యవ్యవహారాలూ అన్నీ ఉన్నాయి.
రకరకాల వంటలూ, రుచులూ, నవనాగరికతా చిహ్నాలైన దుస్తులూ, నగలూ, మేచింగులూ.. పరిధిదాటని అభిమానాలు అన్నీ సమతూకంలో ఉన్నాయి. ఎక్కడా రచయిత్రి నేలవిడిచి సాము చెయ్యలేదు. ఈ నవల చదవడం పూర్తయ్యాక ఓ చక్కని 'జీవితం' లాంటి సినిమాని చూసినంత ఆహ్లాదమూ అనుభూతీ కలిగాయి. చాలా అలవోకగా ఉమగారు చేసిన 'పరకాయ ప్రవేశం' ఈ 'వేదిక'.
- భువనచంద్ర
ఈ నవల కథనం కూచిపూడి నృత్యంలా మృదుమధురంగా సాగిపోతూ ఉంటుంది. ఓ నృత్యకళాకారిణి జీవితానికి 'అద్దం' పట్టిన అపురూప రచన ఈ 'వేదిక'. మొదలు పెట్టడం వరకే పాఠకుల పని. ఆ తరువాత చూపులు అక్షరాల మీద శరవేగంతో పరుగుతీస్తుంటే, మనోచక్షువులు మనకు 'దృశ్యాన్ని' వెండితెర మీద సినిమాలా చూపుతాయి. ఆ వెండితెర కూడా మనస్సే. ప్రేమ, స్వార్థం, త్యాగం, అభిమానం, అంతస్తుల తేడా, కుటుంబ సభ్యుల మీద ఉండే సహజమైన ప్రేమాభిమానాలు, యువతీయువకుల ఆశలూ ఆకాంక్షలూ...నేటి పోకడలూ, నాటి ఆచార్యవ్యవహారాలూ అన్నీ ఉన్నాయి. రకరకాల వంటలూ, రుచులూ, నవనాగరికతా చిహ్నాలైన దుస్తులూ, నగలూ, మేచింగులూ.. పరిధిదాటని అభిమానాలు అన్నీ సమతూకంలో ఉన్నాయి. ఎక్కడా రచయిత్రి నేలవిడిచి సాము చెయ్యలేదు. ఈ నవల చదవడం పూర్తయ్యాక ఓ చక్కని 'జీవితం' లాంటి సినిమాని చూసినంత ఆహ్లాదమూ అనుభూతీ కలిగాయి. చాలా అలవోకగా ఉమగారు చేసిన 'పరకాయ ప్రవేశం' ఈ 'వేదిక'. - భువనచంద్ర© 2017,www.logili.com All Rights Reserved.