యివాళ మనం ప్రత్యేకంగా ఉద్యమించనవసరం లేకుండానే యపాటికే అనేక యితర భాషల్లోకి అనువాదమై యితర ప్రాంతాల వారికీ దేశాలవారికి బాగా పరిచయస్తుడైన తెలుగు కవి వేమన ఒక్కడే. తమిళం కన్నడం ఉర్దు తదితర పొరుగు బాషల మాట అటుoచి ఇంగ్లీషులోకి కూడ విస్తారంగా తర్జుమా అయి రచ్చ గెలిచినా ప్రజా బలం యెంత ఉన్నపటికీ మన పండితుల కుహకంవల్ల వేమన ఒకవిధంగా యింకా ఇంట గెల్వలేకపోతున్నాడు. తెలుగువారిగా మనకు వేమన గూర్చి యేర్పడవల్సిన అవగాహన యింతవరకు యేర్పడనేలేదు.
తన పట్ల పుష్కలంగా ఆత్మవిశ్వాసం ఉన్న వ్యక్తి వేమన. తాను చెపింది వేదం అన్నాడు గాని వేదంలో ఉన్నదన్న మళ్లీ చెప్తున్నట్లుగా చెప్పుకోలేదు. తాను కవిగానే నమ్మకం పూర్తిగా కలిగి ఉండటమే గాక తన కాలపు కవులతో సమూలంగా విభేదిస్తున్న స్పృహ కూడ వేమనకున్నది.
- బంగోరె