బాబుగా ప్రసిద్ధులైన కార్టూనిస్టు కె వి దుర్గాప్రసాద్ గారు తెలుగు జాతికి అందిస్తున్న అపురూపమైన కానుక ఈ పుస్తకం. "ఇవేమన పద్యాలు" అనేది ఆసక్తికరమైన పేరు. వేమన పద్యాలివి. ఇవి మనవి అనే ఆత్మీయతను చాటుతూ వాటికి చక్కని బొమ్మలను సంతరించారు శ్రీబాబు. కార్టూన్ లంటే వ్యంగ్యరేఖా చిత్రాలు. వేమన పద్యాలు కూడా చాలావరకు అంతే. వ్యంగ్యం పైకి హాస్యభరితంగా ఉంటూనే లోపల చురకలు వేస్తుంది. తరం మారుతున్నది. మన పిల్లలు ఆంగ్ల భాషావ్యామోహంలో పడిపోతున్న కాలంలో వేమన పద్యాలు తప్పకుండా వారిని తెలుగుకు కట్టి ఉంచుతాయి. వాటికి బొమ్మల అండ ఉంటే మరింత బలంగా హృదయాలకు హత్తుకుంటాయి.
ఇక్కడ అలాగే జరిగింది. అయితే బొమ్మ గొప్పదా పద్యం గొప్పదా అనికాదు, రెండూ ఒకదానికొకటి పరిపోషకములకు. రెండూ కలిసి వేమన చెప్పిన భావార్ధాలను మరింత ప్రకాశింపజేస్తున్నాయి. వేమన పద్యాలను పెద్దఎత్తున మొదటిసారి దృశ్యమానం చేస్తున్న ఘనత శ్రీబాబుదే. సాహిత్యంలోని భావచిత్రాలను రేఖాచిత్రాల పల్లకిలో ఊరేగిస్తూ హృదయాలతో పాటు కళ్ళనూ వెలిగిస్తున్నారు ఈ సీనియర్ కార్టూనిస్టు.
బాబుగా ప్రసిద్ధులైన కార్టూనిస్టు కె వి దుర్గాప్రసాద్ గారు తెలుగు జాతికి అందిస్తున్న అపురూపమైన కానుక ఈ పుస్తకం. "ఇవేమన పద్యాలు" అనేది ఆసక్తికరమైన పేరు. వేమన పద్యాలివి. ఇవి మనవి అనే ఆత్మీయతను చాటుతూ వాటికి చక్కని బొమ్మలను సంతరించారు శ్రీబాబు. కార్టూన్ లంటే వ్యంగ్యరేఖా చిత్రాలు. వేమన పద్యాలు కూడా చాలావరకు అంతే. వ్యంగ్యం పైకి హాస్యభరితంగా ఉంటూనే లోపల చురకలు వేస్తుంది. తరం మారుతున్నది. మన పిల్లలు ఆంగ్ల భాషావ్యామోహంలో పడిపోతున్న కాలంలో వేమన పద్యాలు తప్పకుండా వారిని తెలుగుకు కట్టి ఉంచుతాయి. వాటికి బొమ్మల అండ ఉంటే మరింత బలంగా హృదయాలకు హత్తుకుంటాయి. ఇక్కడ అలాగే జరిగింది. అయితే బొమ్మ గొప్పదా పద్యం గొప్పదా అనికాదు, రెండూ ఒకదానికొకటి పరిపోషకములకు. రెండూ కలిసి వేమన చెప్పిన భావార్ధాలను మరింత ప్రకాశింపజేస్తున్నాయి. వేమన పద్యాలను పెద్దఎత్తున మొదటిసారి దృశ్యమానం చేస్తున్న ఘనత శ్రీబాబుదే. సాహిత్యంలోని భావచిత్రాలను రేఖాచిత్రాల పల్లకిలో ఊరేగిస్తూ హృదయాలతో పాటు కళ్ళనూ వెలిగిస్తున్నారు ఈ సీనియర్ కార్టూనిస్టు.© 2017,www.logili.com All Rights Reserved.