ఆధునిక కథకు అచ్చమైన నిర్వచనాలు ఈ సంకలనంలోని కథలు. మానవ సంబందాలన్నిటిని కాచి వడపోసిన అక్షరశిల్పాలు ఇవి. ఇందులో కొన్ని కదుపుతాయి... కొన్ని కుదుపుతాయి. మనుషుల వ్యక్తిత్వాలలోని వెలుగునీడలను తన హృదయపు కెమెరాతో రచయిత పట్టుకున్నాడు. మానవ సంబందాలన్నిటికీ పునాది అవసరం. అవసరాలకు మూలం అస్తిత్వం. అస్తిత్వమే ఇవాల్టి వ్యక్తిత్వం. ఇలా ప్రతి పాత్రలోని భావోద్వేగాల చుట్టూ పరుచుకున్న సమాజం - భాష - యాస - ఏడుపు - నవ్వు అన్నీ ప్రతి కథలో ఆవిష్కరించాడు.
ఓ కథలో వాడు అక్షరమైతే వాళ్ళమ్మ మట్టి బలపం. మరో కథలో ఊరు దాటుతున్నప్పుడు కదిలే ఏరులా వాళ్ళ నాన్న మనతో నడుస్తూ వస్తాడు.చేతి వేళ్ళ మధ్యనుండి జారిపోయే చేపపిల్లలా ఈ కథకుడి ప్రతి అనుభవం మనల్ని బ్రతుకు సముద్రం ముందు నిలదీసి నిలబెడుతుంది. ఇతగాడు రాసిన ఒక్కో కథ జీవితంలోని ఒక్కో ప్రస్తానం దగ్గర మనల్ని వెనక్కి తీసికెళ్ళి స్వీయ సమీక్ష చేయిస్తుంది. ఈ కథల రచన - శైలి - శిల్పం కన్నా రచయిత నిజాయితీ ఒక్కటే ఈ సంకలనానికి ప్రాణం... ప్రణవం.
నేలను నమ్ముకున్నవాడికి ఆకాశమే దారి చూపిస్తుందని ప్రవక్త ఎందుకున్నాడో ఈ పేదరికపు ప్రతి కథా నిరూపిస్తుంది. నడవని నెలకు, నడిపించే కాళ్ళకు వేసిన హృదయపు వంతెన ఈ కథల సమాహారం. మనసున్న ప్రతివాడూ ఒక్కసారైనా చదవాల్సిన మానవ సంబంధాల పరిమళ గుచ్చం ఈ సంకలనం.
- వల్లూరి రాఘవరావు
ఆధునిక కథకు అచ్చమైన నిర్వచనాలు ఈ సంకలనంలోని కథలు. మానవ సంబందాలన్నిటిని కాచి వడపోసిన అక్షరశిల్పాలు ఇవి. ఇందులో కొన్ని కదుపుతాయి... కొన్ని కుదుపుతాయి. మనుషుల వ్యక్తిత్వాలలోని వెలుగునీడలను తన హృదయపు కెమెరాతో రచయిత పట్టుకున్నాడు. మానవ సంబందాలన్నిటికీ పునాది అవసరం. అవసరాలకు మూలం అస్తిత్వం. అస్తిత్వమే ఇవాల్టి వ్యక్తిత్వం. ఇలా ప్రతి పాత్రలోని భావోద్వేగాల చుట్టూ పరుచుకున్న సమాజం - భాష - యాస - ఏడుపు - నవ్వు అన్నీ ప్రతి కథలో ఆవిష్కరించాడు. ఓ కథలో వాడు అక్షరమైతే వాళ్ళమ్మ మట్టి బలపం. మరో కథలో ఊరు దాటుతున్నప్పుడు కదిలే ఏరులా వాళ్ళ నాన్న మనతో నడుస్తూ వస్తాడు.చేతి వేళ్ళ మధ్యనుండి జారిపోయే చేపపిల్లలా ఈ కథకుడి ప్రతి అనుభవం మనల్ని బ్రతుకు సముద్రం ముందు నిలదీసి నిలబెడుతుంది. ఇతగాడు రాసిన ఒక్కో కథ జీవితంలోని ఒక్కో ప్రస్తానం దగ్గర మనల్ని వెనక్కి తీసికెళ్ళి స్వీయ సమీక్ష చేయిస్తుంది. ఈ కథల రచన - శైలి - శిల్పం కన్నా రచయిత నిజాయితీ ఒక్కటే ఈ సంకలనానికి ప్రాణం... ప్రణవం. నేలను నమ్ముకున్నవాడికి ఆకాశమే దారి చూపిస్తుందని ప్రవక్త ఎందుకున్నాడో ఈ పేదరికపు ప్రతి కథా నిరూపిస్తుంది. నడవని నెలకు, నడిపించే కాళ్ళకు వేసిన హృదయపు వంతెన ఈ కథల సమాహారం. మనసున్న ప్రతివాడూ ఒక్కసారైనా చదవాల్సిన మానవ సంబంధాల పరిమళ గుచ్చం ఈ సంకలనం. - వల్లూరి రాఘవరావు© 2017,www.logili.com All Rights Reserved.