అప్పుడు నాకు అయిదేళ్ళ వయస్సు ఉంటుంది. ఆకాశం నీలంగా కనిపించింది. నిర్దయగా ఉన్నట్లనిపించింది. గాలి కూడా మంచు ముద్దలాగా చల్లగా ఉంది. నేను ఓ కంచరగాడిద మీద కూర్చుని ఏడుస్తూ పోతున్నాను. అలా గొంతెత్తి పెద్దగా ఏడుస్తూ ఉంటే, ఆ ఏడుపులోనుంచి సంగీతం పాడుతున్నట్లుగా ఓ విధమైన లయ కూడా బయలుదేరింది. అందుచేత నా ఏడుపును ఎవ్వరూ లక్ష్య పెట్టడం లేదు. ముందు పోతున్న కంచరగాడిద మీద మా అమ్మ కూర్చున్నది. మా తమ్ముడైన మహేంద్రుడిని ఆమె తన ఒళ్లో కూర్చోబెట్టుకుంది. వాడికింకా ఓ సంవత్సరమైనా దాటలేదు.
అందుచేత వాడిని వేరే ఒంటరిగా కూర్చోబెట్టలేదు. మహేంద్రుడు హాయిగా అమ్మ ఒళ్లో కూర్చున్నాడు. నాకు అయిదేళ్ళ వయస్సు ఉంది కదా! పెద్ద ఆరితేరిన రౌతుననుకున్నారు. వెనకబోతున్న ఈ కంచరగాడిద మీద నన్ను ఒంటరిగా కూర్చోబెట్టారు. తరువాత ఏం జరిగిందో మరియు ఇలాంటి మరెన్నో కథలు ఈ పుస్తకంలో కలవు.
© 2017,www.logili.com All Rights Reserved.