ఇవాళ కాలం మారింది. విధానాలు మారాయి. నాగళ్ళు మూలనపడ్డాయి. తలగుడ్డలు బరువయ్యాయి. అప్పుల్లో కూరుకుపోయిన రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. మా కాలంలో చావైనా, బతుకైనా చేలోనే! మా అబ్బాయి రైతుల గురించి రాయడానికి నేనే కారణమేమో... నన్ను నిత్యం చూసేవాడు. రైతుగా నా దినచర్యను గమనించేవాడు. కష్టసుఖాలను తెలుసుకునేవాడు. చిన్నతనం నుండి ప్రతిదాన్ని శ్రద్ధగా చూడటం, విషయం తెలుసుకోవడం మావాడికి అలవాటు. అలాగే సేద్యంలోని ఇబ్బందులూ, సబ్బందులూ, కష్టాలు, నష్టాలు, పాడి, పంట, అన్నిటినీ చూసి మనసు కదిలి, మంచి కవిత్వం రాశాడు. మావాడు రాసిన కవిత్వం చదివి గర్వపడుతున్నాను. ఈ కవిత్వం చదివాక నేను చెప్పేది నిజమని మీరూ నమ్ముతారు. కనుక 'వెన్ను విరిగిన కంకులు' మీరు చదవండి! మా శ్రీనును ఆశీర్వదించండి.
- మక్కేన రామసుబ్బయ్య
ఇవాళ కాలం మారింది. విధానాలు మారాయి. నాగళ్ళు మూలనపడ్డాయి. తలగుడ్డలు బరువయ్యాయి. అప్పుల్లో కూరుకుపోయిన రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. మా కాలంలో చావైనా, బతుకైనా చేలోనే! మా అబ్బాయి రైతుల గురించి రాయడానికి నేనే కారణమేమో... నన్ను నిత్యం చూసేవాడు. రైతుగా నా దినచర్యను గమనించేవాడు. కష్టసుఖాలను తెలుసుకునేవాడు. చిన్నతనం నుండి ప్రతిదాన్ని శ్రద్ధగా చూడటం, విషయం తెలుసుకోవడం మావాడికి అలవాటు. అలాగే సేద్యంలోని ఇబ్బందులూ, సబ్బందులూ, కష్టాలు, నష్టాలు, పాడి, పంట, అన్నిటినీ చూసి మనసు కదిలి, మంచి కవిత్వం రాశాడు. మావాడు రాసిన కవిత్వం చదివి గర్వపడుతున్నాను. ఈ కవిత్వం చదివాక నేను చెప్పేది నిజమని మీరూ నమ్ముతారు. కనుక 'వెన్ను విరిగిన కంకులు' మీరు చదవండి! మా శ్రీనును ఆశీర్వదించండి. - మక్కేన రామసుబ్బయ్య© 2017,www.logili.com All Rights Reserved.