1990 ల తర్వాత ప్రభుత్వాల అభివృద్ధి విధానాలు పేదల ఫై సునామీలా ఎలా విరుచుకుపడ్డాయో తెలుగునేల మీద ప్రతిపాదించబడిన ఒక్కొక్క సేజు ను కారిడార్ ను పరిశ్రమను ప్రాజెక్టును తీసుకుని వివరంగా వ్యాసాలు రాసారు బాలగోపాల్. ఆ వ్యాసాలన్నిటినీ కిలిపి ఐదు పుస్తకాలుగా తీసుకొస్తున్నట్టు గత ఏడాది ప్రచురించిన అభివృద్ధి - విధ్వంసం పుస్తకంలో తెలియజేశాం. ఆ సిరీస్ లో ఇది రెండవది.
అభివృద్ధి మంచిచెడుల మీద బిన్నాభిప్రయాలున్న వారికీ సహితం ఒక విషయంలో ఏకాభిప్రయం ఉంటుందనుకుంటున్నాం. అది ఈ ప్రోజెక్టుల వల్ల జరుగుతున్నా విస్తాపన.ఊర్లకు ఊర్లు ఖాళీ చేయాల్సి రావడం ప్రజలకు జరుగుతున్న నష్టానికి వారికీ లభిస్తున్న పరిహారానికి పొంతన లేకపోవడం పునరావాసమనేదే చట్టంలో ఇప్పటికి ఒక హక్కుగా లేకపోవడం ప్రజల అసంతృప్తి ఉద్యమంగా మారినప్పుడు దానిని కఠినంగా అణిచివేయాలని చూడడం... ఇవన్నీ గత 20, 30 ఏళ్లులో అనేకచోట్ల చూశాం. ఇంకా చూస్తూనే ఉన్నాం. అభివృద్ధి కోసం విస్తాపన అనివార్యమని భావించేవాళ్ళు కూడా వీరి పరిస్థితి పట్ల సానుభూతి చూపగలరు. కానీ ప్రత్యామ్నాయాల వైపు ఆలోచించారు. ఇటువంటి అభివృద్ధి అసలు అవసరము అని ఆలోచించారు.
- కే బాలగోపాల్