ఈ రచనలో కొంతభాగం తేజస్వి గారి ఆత్మకథగానే మనకు కనబడుతది. బహుముఖ ప్రజ్ఞాశాలిగా ఏ రంగంలో అడుగిడినా దానిలో పరిపూర్ణతను సాధించిన తేజస్వి గారు ఈ రచనను రచించి 50 సంవత్సరాలు అయినవి. పర్యావరణంలో, సేంద్రియ వ్యవసాయంలో, సాహితీవనంలో అపరిష్కృతమైన చర్చలు, వాదోపవాదాలు జరిగినప్పుడు తేజస్విగారి అనుభవాన్ని పొందేందుకు కన్నడ సమాజం ఎంతగానో ఎదురుచూస్తుండేది. సభలన్నా, సన్మానాలన్నా గిట్టని తేజస్విగారు గ్రామీణ భారతంలో రైతుగా నిలదొక్కుకుంటూ తనకు సేద్యంలో ఎదురైన సంఘటనలను ముఖ్యంగా అట్టడుగున ఉన్న జనుల మనోవైజ్ఞానికతను బహు విపులంగా తన రచనల ద్వారా వెల్లడించారు.
తండ్రి జ్ఞానపీఠ పురస్కారాన్ని, తోడబుట్టినోళ్ళు మరియు వారి పరివారం సమాజంలో ఎంతో ఉన్నత స్థానాలలో ఉన్నా, తనకు ప్రీతిపాత్రమైన గ్రామీణ జీవనాన్నే ఎంచుకుని, ఎన్నో రచనలతో అలరారిన తేజస్విగారి రచనలు ప్రతి గ్రామంలోని ఇళ్ళలో పూజనీయ స్థానంలో ఉంచబడిన దాన్ని అనువాదకుడినైన నేను గమనించడం జరిగింది.
- శాఖమూరు రామగోపాల్