ఆధునిక కవుల్లో విశ్వనాథ సత్యనారాయణగారు ఒక హిమలయోత్తుంగ శిఖరం. అయన రచనా వైవిద్యం అనంతమైంది. అయితే వీటిలో అంతస్సుత్రం భారతీయ సంస్కృతీ సముల్లసనం. అనంతవిశ్వంలో ఎన్ని మతాలున్నా భగవంతునిపై విశ్వాసం మాత్రం అన్నిటిలో కనిపించే ఏకసూత్రం. దైవాలు, ఆరాధనా విధానాల్లోని అనేకత్వం భక్తి అనే ఏకత్వంలోనే లయిస్తోంది. మానవుని పరమేశ్వరుని వద్దకు చేర్చేది ఉపాసన. ఉపాసన అనే శబ్దానికి సమీపంలో ఉండటమనేది శబ్దార్థం. ఎవరి సమీపంలో అంటే తానెంచుకొన్న లేదా తనకు లక్ష్యభూతమైన విషయానికని తాత్పర్యం. 'విద్యోపాసన', కళోపాసన' వంటి శబ్దాలీ విషయాన్ని స్పష్టం చేస్తున్నా భగవదారాధనా విషయకంగానే ఇది రూఢమైంది. వరివస్యా, శుశ్రూషా, పరిచర్యా వంటి పదాలు దీనికి పర్యాయపదాలు.
భారతీయ వాజ్ఞ్మయంలో ప్రప్రథమంగా వెలిసినవి వేదాలు. ఆ వేదాలు దైవప్రార్థనాపరాలే - అని ఋగ్వేదానికన్వయించుకొంటే. ఆ ప్రార్థనకు కొంత ప్రక్రియను జోడించి అనుష్ఠానాత్మకతను అంటే యజ్ఞాది క్రతునిర్వహణను చెప్పేది యజుర్వేదం. అథర్వవేదంలో అధికభాగం చతుర్విధపురుషార్థాల్లో ఆశించే అర్థకామాలను సాధించటానికి చేపట్టే మార్గాలను చర్చిస్తుంది. కనుక దైవారాధన సృష్టితోనే ఆరంభమైందని చెప్పటంలో ఆక్షేపణ ఏమీ లేదు.
- డా. గుమ్ములూరి ఇందిర