ఆమోదము
కళ అనునది చర్చాక్షమమైన అనుభూతిని ప్రసాదించు నామాత్మక సృష్టి (noumenal creation). ప్రయోజనాపేక్ష చేత అది సుకుమార బుద్ధులకు శాస్త్రజ్ఞానమును సులభముగా నందిచ్చు వాహిక (medium) కూడ ఆగును. భామహాదులట్లే భావించినారు. సాహిత్యము కళ. ఈ రచనలకు విలువ, ఈ విలువకు ఫలముగా చిరకాల స్థితి కలుగుటకు కారణమేమి? వాని ఆధిమానసిక ఆధ్యాత్మిక సంపద. ఇది ప్రాక్ ప్రతీచీ విమర్శక సమ్మతమైన మాట. అధి మానసికాంశమునే అధిదైవిక మనుట మన సంప్రదాయము. అధునాతన కాలమున ఇట్టి సాహిత్యరచనలు సమృద్ధిగా సంతరించిన వారిలో విశ్వనాథ సత్యనారాయణగారు అగ్రగణ్యులు.
విశ్వనాథను ప్రతిభాశాలి యనుట గతానుగతికము. అట్లనెడి వారికి ప్రతిభ అనగా నేమియో, బుద్ధి శక్తులలో దాని కక్ష్య ఏదో తెలియదనవలెను. ప్రతిభ అనగా మనుష్యజమైన దైవీ మేధ. ఇది తొలిమెట్టు మాత్రమె; దీనికి పైన గంధర్వాధిష్ఠితమైన శైలి, ఆప్సరోధిష్ఠితమైన గృహీతి, అశ్వినావధిష్ఠితమైన చత్వ, సరస్వత్వష్టితమైన చార్వి, ఇంద్రాధిష్ఠితమైన మేధ అన్నింటికిని పైన సాక్షాత్కార ప్రదమైన పండ-ఇన్ని ఉన్నవి. విశ్వనాథ పండితుఁడు. ఆయన బుద్ధిశక్తి ఆలాతచక్రసదృశము; దశ దిశలు దర్శించును; వెలుగులు చిమ్మును. ఆయన నిర్వహించిన సాహిత్య ప్రక్రియలు, వాని సిద్ధి దీనికి నిదర్శనము.
అయినను విశ్వనాథ రచయితగా వివాదగ్రస్తుఁడు ! ఆయన నవలలకు నవలా లక్షణములు పట్టవని ఒక ఆక్షేపమున్నది. ఉన్నను, నవలలో జీవితము సుష్టుగా, సూటిగా ముద్రితమగునను ప్రధాన లక్షణమునకు భంగములేదు. పాశ్చాత్యుల నవలలలోని లక్షణ సమగ్రత ఎంతమట్టునకో తెలిసినవారు విశ్వనాథను విమర్శింపరు. విశ్వనాథ నవలలు కావ్య కల్పములు. ఆయన.....................
ఆమోదము కళ అనునది చర్చాక్షమమైన అనుభూతిని ప్రసాదించు నామాత్మక సృష్టి (noumenal creation). ప్రయోజనాపేక్ష చేత అది సుకుమార బుద్ధులకు శాస్త్రజ్ఞానమును సులభముగా నందిచ్చు వాహిక (medium) కూడ ఆగును. భామహాదులట్లే భావించినారు. సాహిత్యము కళ. ఈ రచనలకు విలువ, ఈ విలువకు ఫలముగా చిరకాల స్థితి కలుగుటకు కారణమేమి? వాని ఆధిమానసిక ఆధ్యాత్మిక సంపద. ఇది ప్రాక్ ప్రతీచీ విమర్శక సమ్మతమైన మాట. అధి మానసికాంశమునే అధిదైవిక మనుట మన సంప్రదాయము. అధునాతన కాలమున ఇట్టి సాహిత్యరచనలు సమృద్ధిగా సంతరించిన వారిలో విశ్వనాథ సత్యనారాయణగారు అగ్రగణ్యులు. విశ్వనాథను ప్రతిభాశాలి యనుట గతానుగతికము. అట్లనెడి వారికి ప్రతిభ అనగా నేమియో, బుద్ధి శక్తులలో దాని కక్ష్య ఏదో తెలియదనవలెను. ప్రతిభ అనగా మనుష్యజమైన దైవీ మేధ. ఇది తొలిమెట్టు మాత్రమె; దీనికి పైన గంధర్వాధిష్ఠితమైన శైలి, ఆప్సరోధిష్ఠితమైన గృహీతి, అశ్వినావధిష్ఠితమైన చత్వ, సరస్వత్వష్టితమైన చార్వి, ఇంద్రాధిష్ఠితమైన మేధ అన్నింటికిని పైన సాక్షాత్కార ప్రదమైన పండ-ఇన్ని ఉన్నవి. విశ్వనాథ పండితుఁడు. ఆయన బుద్ధిశక్తి ఆలాతచక్రసదృశము; దశ దిశలు దర్శించును; వెలుగులు చిమ్మును. ఆయన నిర్వహించిన సాహిత్య ప్రక్రియలు, వాని సిద్ధి దీనికి నిదర్శనము. అయినను విశ్వనాథ రచయితగా వివాదగ్రస్తుఁడు ! ఆయన నవలలకు నవలా లక్షణములు పట్టవని ఒక ఆక్షేపమున్నది. ఉన్నను, నవలలో జీవితము సుష్టుగా, సూటిగా ముద్రితమగునను ప్రధాన లక్షణమునకు భంగములేదు. పాశ్చాత్యుల నవలలలోని లక్షణ సమగ్రత ఎంతమట్టునకో తెలిసినవారు విశ్వనాథను విమర్శింపరు. విశ్వనాథ నవలలు కావ్య కల్పములు. ఆయన.....................© 2017,www.logili.com All Rights Reserved.