సమస్యల పట్ల అతివేగంగా స్పందించి తనదైన రీతిలో విలువైన కవిత్వానికి వైవిధ్యమైన నవలలకు ప్రాణప్రతిష్ట చేస్తున్న తెలుగు నవలా రచయిత శ్రీరామకవచం సాగర్. సాగరమంతటి హృదయంతో నడిచే విజ్ఞాన సర్వస్వo అయన. ఆయనలోని ఆవేశం నిబద్దత తెలుగుసాహిత్యానికి ఆభరణంగా ఆయన్ను నిలిపాయి. ఆయనో కవిత రాసినా కథ రాసినా నవల రాసినా విమర్శ రాసినా ఒక ప్రామాణికంగా నిలపగల్గడం సాగర్ గారి ప్రత్యేకత. అందరికి అందుబాటులో వుంటూ ఎలాంటి భేషజాలకు పోనీ సున్నిత హృదయులు సాగర్ గారంటే అతిశయోక్తి కాబోదు. కేవలం స్వభావోక్తి మాత్రమే.
కవిత్వానికి బేరీజు వేసి నిఖార్సయిన విలువకట్టే షరాబు శ్రీరామకవచం సాగర్. అయన ఏంరాసిన అది పాఠకుల్ని ఆలోచింపజేస్తుంది. కుదుపులను సరిచేస్తుంది. పాలకుల పాలిట గొడ్డలిపెట్టు అవుతుంది. సమాజాభ్యుదయం కోరే నిజమైన కవి సాగర్. మనిషిపట్ల సమాజం పట్ల అయన ఆలోచనలు దృక్పథం నవ సమాజాన్నికోరుకునే రీతిలో సాగుతున్నాయి. విలువైన సమాజం కోసం వెంపర్లాడుతున్నాయి. సరికొత్త మానవ సమాజం కోసం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.
- సాగర్ శ్రీరామ కవచం