ఈ తరంలోని యువకవులు, రచయితలు, జర్నలిస్టులు, విద్యార్థులువీళ్లను దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే, ఇప్పుడు applied linguistics ఎంతో అవసరమని అనిపిస్తుంది. వీళ్లలో కొందరికి భాషను నేర్చుకోవాలనే, మెరుగుపరచుకోవాలనే తపన ఉంటుంది. అయితే, సరైన మార్గదర్శనం దొరకక అలమటిస్తుంటారు. వీళ్లకు సరిపోయే విధంగా, ఉపయోగపడే విధంగా భాషాసవ్యత గురించి చర్చిస్తే మేలు చేసినవాళ్లమౌతాము. పండితుల కోసం మాత్రమే రాస్తే ఒరిగేది తక్కువ అని నా అభిప్రాయం. ఎందుకంటే, వాళ్లు ఎలాగూ పండితులే. వాళ్లకు మనం చెప్పగలిగేది అంతంత మాత్రమే. నిజానికి వాళ్లే నాలాంటివాళ్లకు చెప్పగలరు. అందుకే, ఈ పుస్తకంలో నేను రాస్తున్నది. అటు కేవలం పండితుల కోసం కాకుండా ఇటు పూర్తిగా ప్రాథమిక దశలో ఉన్నవారికి కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. ఇది నేను కావాలని అవలంబించిన మార్గం. అయితే, కొందరు పండితులకు ఈ విధానం నచ్చకపోవచ్చు.
- ఎలనాగ
ఈ తరంలోని యువకవులు, రచయితలు, జర్నలిస్టులు, విద్యార్థులువీళ్లను దృష్టిలో ఉంచుకుని ఆలోచిస్తే, ఇప్పుడు applied linguistics ఎంతో అవసరమని అనిపిస్తుంది. వీళ్లలో కొందరికి భాషను నేర్చుకోవాలనే, మెరుగుపరచుకోవాలనే తపన ఉంటుంది. అయితే, సరైన మార్గదర్శనం దొరకక అలమటిస్తుంటారు. వీళ్లకు సరిపోయే విధంగా, ఉపయోగపడే విధంగా భాషాసవ్యత గురించి చర్చిస్తే మేలు చేసినవాళ్లమౌతాము. పండితుల కోసం మాత్రమే రాస్తే ఒరిగేది తక్కువ అని నా అభిప్రాయం. ఎందుకంటే, వాళ్లు ఎలాగూ పండితులే. వాళ్లకు మనం చెప్పగలిగేది అంతంత మాత్రమే. నిజానికి వాళ్లే నాలాంటివాళ్లకు చెప్పగలరు. అందుకే, ఈ పుస్తకంలో నేను రాస్తున్నది. అటు కేవలం పండితుల కోసం కాకుండా ఇటు పూర్తిగా ప్రాథమిక దశలో ఉన్నవారికి కాకుండా మధ్యస్థంగా ఉంటుంది. ఇది నేను కావాలని అవలంబించిన మార్గం. అయితే, కొందరు పండితులకు ఈ విధానం నచ్చకపోవచ్చు. - ఎలనాగ© 2017,www.logili.com All Rights Reserved.