1953లో కరీంనగర్ జిల్లాలోని ఎలగందులలో జననం. మెడిసిన్ కోర్సు పూర్తయ్యాక ఉద్యోగంలో ఉంటూనే చిన్న పిల్లల వైద్యవిభాగంలో స్పెషలైజేషన్ చెయ్యడం కొంత సాంత్వననిచ్చే విషయం. ఆనాటి 'భారతి' మొదలుగా వివిధ పత్రికల్లో, ఆకాశవాణిలో కవితలు, కథలు, పద్యాలు, వ్యాసాలు, సమీక్షలు, అనువాదాలు, లలిత గీతాలు ప్రకటితాలు. సోమర్సెట్ మామ్ నవలిక Alien Cornకు చేసిన తెలుగు అనువాదం 'కలుపుమొక్క'గా ప్రచురితమయింది. తెలుగు నుడికారపు చమత్ 'కారాన్ని'మేళవించి ప్రామాణికమైన గళ్ళనుడి కట్లను వండడం ఇష్టం. అర్థాంగి - ప్రవీణ, అనుంగు తనయులు రుత్విజ్, సాహిత్, ఆత్మీయ అనుచారకుడు రమణ.
అనుభూతిలో గాఢత, అభివ్యక్తిలో వినూత్నత, శిల్పంలో ఉత్కృష్టత లేకుంటే కవిత్వం శోభాయమానంగా రూపుకట్టదని బలమైన నమ్మకం. శాస్త్రీయ సంగీత మాధుర్యంలో (ముఖ్యంగా హిందూస్తానీ) తడిసి ఉండకపోతే జీవితంలో ఒక అనూనమైన తృప్తి అంతర్లయగా ఒదిగి ఉండేది కాదని విశ్వాసం.. నిత్యం చురుకైన సాహిత్య విద్యార్థిగా ఉంటూ ఆ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఆశ, ఉద్యోగం పట్ల గల అమిత శ్రద్ధాసక్తుల కారణంగా అడియాసగానే మిగిలి పోవడం పూడ్చలేని వెలితి అనిపిస్తుంది.
- ఎలనాగ
1953లో కరీంనగర్ జిల్లాలోని ఎలగందులలో జననం. మెడిసిన్ కోర్సు పూర్తయ్యాక ఉద్యోగంలో ఉంటూనే చిన్న పిల్లల వైద్యవిభాగంలో స్పెషలైజేషన్ చెయ్యడం కొంత సాంత్వననిచ్చే విషయం. ఆనాటి 'భారతి' మొదలుగా వివిధ పత్రికల్లో, ఆకాశవాణిలో కవితలు, కథలు, పద్యాలు, వ్యాసాలు, సమీక్షలు, అనువాదాలు, లలిత గీతాలు ప్రకటితాలు. సోమర్సెట్ మామ్ నవలిక Alien Cornకు చేసిన తెలుగు అనువాదం 'కలుపుమొక్క'గా ప్రచురితమయింది. తెలుగు నుడికారపు చమత్ 'కారాన్ని'మేళవించి ప్రామాణికమైన గళ్ళనుడి కట్లను వండడం ఇష్టం. అర్థాంగి - ప్రవీణ, అనుంగు తనయులు రుత్విజ్, సాహిత్, ఆత్మీయ అనుచారకుడు రమణ. అనుభూతిలో గాఢత, అభివ్యక్తిలో వినూత్నత, శిల్పంలో ఉత్కృష్టత లేకుంటే కవిత్వం శోభాయమానంగా రూపుకట్టదని బలమైన నమ్మకం. శాస్త్రీయ సంగీత మాధుర్యంలో (ముఖ్యంగా హిందూస్తానీ) తడిసి ఉండకపోతే జీవితంలో ఒక అనూనమైన తృప్తి అంతర్లయగా ఒదిగి ఉండేది కాదని విశ్వాసం.. నిత్యం చురుకైన సాహిత్య విద్యార్థిగా ఉంటూ ఆ రంగంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే ఆశ, ఉద్యోగం పట్ల గల అమిత శ్రద్ధాసక్తుల కారణంగా అడియాసగానే మిగిలి పోవడం పూడ్చలేని వెలితి అనిపిస్తుంది. - ఎలనాగ© 2017,www.logili.com All Rights Reserved.