జాతీయస్థాయి కవిత్వాన్ని ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలంటే, ఆంగ్లంలో వస్తున్న ప్రామాణిక అనువాద జర్నల్సనే కాక అదే తరహాకు, అదే స్థాయికి చెందిన అంతర్జాల పత్రికలను చదువుతుండటం అవసరమనే విషయాన్ని గ్రహించిన నేను, వాటి అధ్యయనాన్ని ఎప్పుడూ ఆపలేదు. అటువంటి కవిత్వాన్ని సాధ్యమైనంత తరచుగా చదువుతూ, నాకు బాగా నచ్చిన కవితలను ఎప్పటికప్పుడు తెలులులోకి అనువదిస్తూ వస్తున్నాను. దీన్ని ఎప్పుడూ ఒక పవిత్రమైన బాధ్యతగా, కర్తవ్యంగా భావిస్తాను. గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆ దిశలో నేను చేసిన కృషి ఫలితమే ఈ అనువాద గ్రంథం.
అనువాదం thankless job అనీ, దానివల్ల వచ్చే కీర్తి అంతంత మాత్రమేనని కొందరు వ్యాఖ్యానించినా అనువాద ప్రక్రియ పట్ల నా అనురక్తి రవ్వంత కూడా తగ్గలేదు. కీర్తి కోసం, ఇతరుల మెప్పుకోసం మాత్రమే సాహిత్యాన్ని సృజించటం నేనొప్పుకోను. అటువంటి దుగ్గే మన రచనా ప్రమాణాలు తగ్గడానికి కారణమౌతుందని నమ్ముతాను.
వివిధ భారతీయ భాషలలోని మూల రచనలకు చేసిన అనువాదాలివి. వస్తువులో, అభివ్యక్తిలో తెలుగు కవిత్వానికి కొంచెం భిన్నంగా ఉండే భారతీయ భాషల కవితలను తెలుగువారికి - ముఖ్యంగా కవిత్వం పట్ల అపేక్ష ఉన్నవారికి - రుచి చూపించ గలుగుతున్నందుకు నాకెంతో సంతృప్తిగా ఉంది. తమ కవితలను అనువదించేందుకు నాకు అనుమతినిచ్చిన ఆయా కవులకు నేనెంతగానో రుణపడి వున్నాను.
- ఎలనాగ
జాతీయస్థాయి కవిత్వాన్ని ఎప్పటికప్పుడు ఫాలో అవ్వాలంటే, ఆంగ్లంలో వస్తున్న ప్రామాణిక అనువాద జర్నల్సనే కాక అదే తరహాకు, అదే స్థాయికి చెందిన అంతర్జాల పత్రికలను చదువుతుండటం అవసరమనే విషయాన్ని గ్రహించిన నేను, వాటి అధ్యయనాన్ని ఎప్పుడూ ఆపలేదు. అటువంటి కవిత్వాన్ని సాధ్యమైనంత తరచుగా చదువుతూ, నాకు బాగా నచ్చిన కవితలను ఎప్పటికప్పుడు తెలులులోకి అనువదిస్తూ వస్తున్నాను. దీన్ని ఎప్పుడూ ఒక పవిత్రమైన బాధ్యతగా, కర్తవ్యంగా భావిస్తాను. గత మూడు నాలుగు సంవత్సరాలుగా ఆ దిశలో నేను చేసిన కృషి ఫలితమే ఈ అనువాద గ్రంథం. అనువాదం thankless job అనీ, దానివల్ల వచ్చే కీర్తి అంతంత మాత్రమేనని కొందరు వ్యాఖ్యానించినా అనువాద ప్రక్రియ పట్ల నా అనురక్తి రవ్వంత కూడా తగ్గలేదు. కీర్తి కోసం, ఇతరుల మెప్పుకోసం మాత్రమే సాహిత్యాన్ని సృజించటం నేనొప్పుకోను. అటువంటి దుగ్గే మన రచనా ప్రమాణాలు తగ్గడానికి కారణమౌతుందని నమ్ముతాను. వివిధ భారతీయ భాషలలోని మూల రచనలకు చేసిన అనువాదాలివి. వస్తువులో, అభివ్యక్తిలో తెలుగు కవిత్వానికి కొంచెం భిన్నంగా ఉండే భారతీయ భాషల కవితలను తెలుగువారికి - ముఖ్యంగా కవిత్వం పట్ల అపేక్ష ఉన్నవారికి - రుచి చూపించ గలుగుతున్నందుకు నాకెంతో సంతృప్తిగా ఉంది. తమ కవితలను అనువదించేందుకు నాకు అనుమతినిచ్చిన ఆయా కవులకు నేనెంతగానో రుణపడి వున్నాను. - ఎలనాగ
© 2017,www.logili.com All Rights Reserved.