డి కె చదువులబాబు కవితా సంపుటి "ఆకాశం అందుతోంది" లో ప్రతి కవిత ఉదాహరణ యోగ్యంగా ఉంది. అందువల్ల మచ్చుకు ఒకటి, రెండు కవితల్లో నుంచి కొన్ని పంక్తులు ఉదాహరిస్తాను. ఒక మూడు పంక్తుల కవితలో చదువులబాబు భావుకత, అభివ్యక్తి చతురత గోచరమవుతాయి. కాలంపండు అనే శీర్షికతో రచించిన కవిత ఇలా ఉంది.
గోడపై వాలిన
గడియారం చిలుక
కాలం పండును కోరుకుతోంది.
గడియారం చిలుక అనడంలోనే గణనీయ నవ్యత ఉంది.
ఒక్కసారి పలకరించవా కన్నా! అనే శీర్షికతో ఈ కవి రచించిన కవితలో కృతఘ్నుడైన కొడుకును గూర్చిన ప్రస్తావన ఇలా ఉంది.
దోసెడు నీళ్ళు పోస్తే
సర్వస్వం ఇచ్చేది చెట్టు
సర్వస్వం ధార పోస్తే
బయటకు ఈడ్చేది కొడుకు.
ఇలా సాగిపోయిన ఈ కవితలో చివరి రెండు పంక్తులు హృదయ ద్రావకంగా వున్నాయి, ఆ పంక్తులివి.
వారానికోసారైనా పలుకరించరా కన్నా
ఆ పలుకే మాకు పన్నీరని మరవకురా చిన్నా!
మనం ఎంత పని వత్తిడిలో వున్నా, ఎక్కడున్నా తల్లిదండ్రులను పలకరించాలని, ప్రేమను పంచాలని చెప్పినతీరు బావుంది.
ఇలాంటి ఎన్నో కవితలతో డి కె చదువులబాబు ఈ కవితా సంపుటిని రూపొందించి ఎందరెందరో అభినందనలు అందుకుంటున్నారు... నాతో సహా...
- డా సి నారాయణరెడ్డి
డి కె చదువులబాబు కవితా సంపుటి "ఆకాశం అందుతోంది" లో ప్రతి కవిత ఉదాహరణ యోగ్యంగా ఉంది. అందువల్ల మచ్చుకు ఒకటి, రెండు కవితల్లో నుంచి కొన్ని పంక్తులు ఉదాహరిస్తాను. ఒక మూడు పంక్తుల కవితలో చదువులబాబు భావుకత, అభివ్యక్తి చతురత గోచరమవుతాయి. కాలంపండు అనే శీర్షికతో రచించిన కవిత ఇలా ఉంది. గోడపై వాలిన గడియారం చిలుక కాలం పండును కోరుకుతోంది. గడియారం చిలుక అనడంలోనే గణనీయ నవ్యత ఉంది. ఒక్కసారి పలకరించవా కన్నా! అనే శీర్షికతో ఈ కవి రచించిన కవితలో కృతఘ్నుడైన కొడుకును గూర్చిన ప్రస్తావన ఇలా ఉంది. దోసెడు నీళ్ళు పోస్తే సర్వస్వం ఇచ్చేది చెట్టు సర్వస్వం ధార పోస్తే బయటకు ఈడ్చేది కొడుకు. ఇలా సాగిపోయిన ఈ కవితలో చివరి రెండు పంక్తులు హృదయ ద్రావకంగా వున్నాయి, ఆ పంక్తులివి. వారానికోసారైనా పలుకరించరా కన్నా ఆ పలుకే మాకు పన్నీరని మరవకురా చిన్నా! మనం ఎంత పని వత్తిడిలో వున్నా, ఎక్కడున్నా తల్లిదండ్రులను పలకరించాలని, ప్రేమను పంచాలని చెప్పినతీరు బావుంది. ఇలాంటి ఎన్నో కవితలతో డి కె చదువులబాబు ఈ కవితా సంపుటిని రూపొందించి ఎందరెందరో అభినందనలు అందుకుంటున్నారు... నాతో సహా... - డా సి నారాయణరెడ్డి© 2017,www.logili.com All Rights Reserved.