‘సిరి’ మువ్వలకు గురువెవ్వరో!
గుండెను చీల్చేసినా రవళించేలా సంగీతశిక్షణనిస్తూ!!
అభిజిత్తునవుతున్నా!
శ్వేతతుహినం పై నిను చేరేందుకై!!
ఎవరు తెరుస్తారో ప్రతిరేయీ!
వెలుగు కుంకుమను పరిచేందుకై.. గగనాన నక్షత్రపు భరిణెలను..!!
కల్పనగ మారాలనుంది!
విశ్వనాధుని మరో కిన్నెరసానినై జన్మించేందుకై!!
‘వెన్నెల్లో ఆడ’పిల్లనై మెప్పించాలనుంది!
వీరేంద్రుడంటి మరో యద్భుతం తారసపడితే!!
జీవితసారం ఇంతేనేమో!
సాఫీగాను సాగనివ్వదు.. సూఫీగాను ఉండనివ్వదు!!
ప్రతి జీవికీ తప్పని రా(గీ)త!
బ్రతుకుపత్రంపై వీడ్కోలు సంతకం చేయడం!!
మన భరతమాతకు స్వతంత్ర్యమా, ఎప్పుడొచ్చింది!
స్త్రీలోలురంతా రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తుంటే!!
శైశవంలో మూసిన గుప్పిళ్ళకు అర్ధం!
ప్రపంచాన్ని గుప్పిట చేజిక్కించుకోవాలని కలగనడమేనేమో!!
జడకుప్పెలు గొప్ప నాట్యకత్తెలు!!
తెగ నర్తిస్తుంటాయి.. నడుమొంపుల్లోజేరి!!
ఏ పేరంటానికి వెళుతుందో!
ఏడురంగుల కోకకట్టి గగనకాంత!!
‘సిరి’ మువ్వలకు గురువెవ్వరో! గుండెను చీల్చేసినా రవళించేలా సంగీతశిక్షణనిస్తూ!! అభిజిత్తునవుతున్నా! శ్వేతతుహినం పై నిను చేరేందుకై!! ఎవరు తెరుస్తారో ప్రతిరేయీ! వెలుగు కుంకుమను పరిచేందుకై.. గగనాన నక్షత్రపు భరిణెలను..!! కల్పనగ మారాలనుంది! విశ్వనాధుని మరో కిన్నెరసానినై జన్మించేందుకై!! ‘వెన్నెల్లో ఆడ’పిల్లనై మెప్పించాలనుంది! వీరేంద్రుడంటి మరో యద్భుతం తారసపడితే!! జీవితసారం ఇంతేనేమో! సాఫీగాను సాగనివ్వదు.. సూఫీగాను ఉండనివ్వదు!! ప్రతి జీవికీ తప్పని రా(గీ)త! బ్రతుకుపత్రంపై వీడ్కోలు సంతకం చేయడం!! మన భరతమాతకు స్వతంత్ర్యమా, ఎప్పుడొచ్చింది! స్త్రీలోలురంతా రోడ్లపై విచ్చలవిడిగా సంచరిస్తుంటే!! శైశవంలో మూసిన గుప్పిళ్ళకు అర్ధం! ప్రపంచాన్ని గుప్పిట చేజిక్కించుకోవాలని కలగనడమేనేమో!! జడకుప్పెలు గొప్ప నాట్యకత్తెలు!! తెగ నర్తిస్తుంటాయి.. నడుమొంపుల్లోజేరి!! ఏ పేరంటానికి వెళుతుందో! ఏడురంగుల కోకకట్టి గగనకాంత!!© 2017,www.logili.com All Rights Reserved.