సృష్టిలో హృదయ రంజకమైన ఆనందాలు కొన్ని మాత్రమే. వాటిలో అందాన్ని వీక్షించినప్పుడు కలిగే ఆనందం ఒకటవది. ఆ అందాన్ని ఆస్వాదిన్చినప్పుడు కలిగే ఆనందం రెండవది. సంగీత సాహిత్యాదులు కూడా హృదయ మనోరంజకమైన ఆనందాన్ని ప్రోదిస్తాయి. వీటన్నింటి కంటే అమితానందాన్ని అనిర్వచనీయమైన అనుభూతిని పొందడానికి రెండు దారులున్నాయి. ఒకటి భక్తి, మరొకటి రక్తి. ఈ రెండు దారులు ఒకేదారిగా మారి రహదారిగా ఎవరి మనసు మారుతుందో వారు అమితానందాన్ని పొందగలుగుతారు. అందుకే జయదేవుడు, త్యాగయ్య, కంచెర్ల గోపన్న లాంటి భక్త పుంగవులు ఈ అమితానందాన్ని పొందినవారే.
జయదేవుడు రచించిన ఈ గీత గోవింద కావ్యము రాదామాధవుల ప్రణయ శృంగార కేళీ విలాసాల సందర్భాలను అత్యంత రమణీయంగా రచించాడు. గీత గోవింద కావ్య రచన మాతృక సంస్కృతంలో ఉండటం వలన దీని ప్రాధాన్యత ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అందుకే పాఠకులకి మళ్ళీ పఠానాసక్తి కలిగించే ఒక చారిత్రిక సందర్భమిది.
సృష్టిలో హృదయ రంజకమైన ఆనందాలు కొన్ని మాత్రమే. వాటిలో అందాన్ని వీక్షించినప్పుడు కలిగే ఆనందం ఒకటవది. ఆ అందాన్ని ఆస్వాదిన్చినప్పుడు కలిగే ఆనందం రెండవది. సంగీత సాహిత్యాదులు కూడా హృదయ మనోరంజకమైన ఆనందాన్ని ప్రోదిస్తాయి. వీటన్నింటి కంటే అమితానందాన్ని అనిర్వచనీయమైన అనుభూతిని పొందడానికి రెండు దారులున్నాయి. ఒకటి భక్తి, మరొకటి రక్తి. ఈ రెండు దారులు ఒకేదారిగా మారి రహదారిగా ఎవరి మనసు మారుతుందో వారు అమితానందాన్ని పొందగలుగుతారు. అందుకే జయదేవుడు, త్యాగయ్య, కంచెర్ల గోపన్న లాంటి భక్త పుంగవులు ఈ అమితానందాన్ని పొందినవారే. జయదేవుడు రచించిన ఈ గీత గోవింద కావ్యము రాదామాధవుల ప్రణయ శృంగార కేళీ విలాసాల సందర్భాలను అత్యంత రమణీయంగా రచించాడు. గీత గోవింద కావ్య రచన మాతృక సంస్కృతంలో ఉండటం వలన దీని ప్రాధాన్యత ఇప్పటికీ చాలా మందికి తెలియదు. అందుకే పాఠకులకి మళ్ళీ పఠానాసక్తి కలిగించే ఒక చారిత్రిక సందర్భమిది.© 2017,www.logili.com All Rights Reserved.