"ఆకాశం అవతలివైపుకి" వచన కవితా సంపుటితో తెలుగు పాఠకుల ముందుకొచ్చారు జమ్ములమడక భవభూతిశర్మ గారు. అయన ఇంతకుముందే 2007లో "మా నాన్న జమ్ములమడక మాధవరామశర్మ" అనే గ్రంథం 2012లో "శ్రీ గాయత్రీ మంత్ర వైభవం" అనే గ్రంథం ప్రచురించి పలువురి ప్రశంసలు పొందారు. 40 సంవత్సరాలకు పైగా అధ్యాపకుడిగా విశిష్ట సేవలనందించిన శర్మ గారు నిత్యం పత్రికల ద్వారా కవిత్వం సాహిత్య వ్యాసాలలో కనిపిస్తుంటారు. గుంటూరు జిల్లా రచయితల సంఘంలో అయన సభ్యులు. ప్రతి సమావేశానికి హాజరై మంచి సూచనలు ఇవ్వటం అయన ప్రత్యేకత. గుంటూరు జిల్లా రచయితల సంఘం వల్ల కేవలం సాహిత్య ప్రయోజనమే కాదు భవభూతి శర్మగారి వంటి సహృదయ మిత్రుల పరిచయభాగ్యం కూడా కలుగుతుంది. అయన మంచి మనిషి.
"ఆకాశం అవతలివైపుకి...." కవితా సంపుటిలో శ్రీ శర్మగారు అనేక అంశాలను కవితా వస్తువులుగా ఎంచుకున్నారు. తాను బోధించిన సబ్జక్టు తాత్వికత - ప్రక్రుతి పరిరక్షణ వంటి అంశాలతో పాటు సమకాలీన సమాజం అందులోని వ్యక్తులు సమస్యలు కేంద్రంగా అయన కవితలు వున్నాయి. తనదైన శైలితో మంచి కవిత్వంలో మన ముందుకొచ్చిన శర్మ గారికి అభినందనలు. అయన నిరంతర చైతన్యశీలి. భవిష్యత్తులో అయన నుండి మరిన్ని రచనలు ఆశిస్తున్నాను.
- జమ్ములమడక భవభూతి శర్మ